Bandi Sanjay : కరీంనగర్లో ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్లు రూపాయి నాణేనికి రెండు ముఖాల్లా ఉన్నాయి. కేసీఆర్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు…
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ ఓ రేంజ్లో నడుస్తోంది. ఇది ఎక్కడో మొదలైంది గానీ.. చివరికి ఎట్నుంటి ఎటు వెళ్తోందన్నది మాత్రం అంతుచిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అయితే.. వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధుల యుద్ధం హస్తిన దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు.. జిల్లా ఎమ్మెల్యేలు. ఈ ఆధిపత్య పోరు చాలా పెద్ద రచ్చకే దారితీస్తోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
తెలంగాణలో మరో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలన్నీ లోకల్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ... గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంతో పాటు ఈ ఏడాదిన్నరలో తామేం చేశామో కూడా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ కన్నా.. బీజేపీనే ఎక్కువగా నమ్ముతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను నియమించినా.. కాషాయ పార్టీ మాత్రం పూర్తిగా విశ్వసించడం లేదట. అందుకే, సీబీఐ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక సమూహం లేదా ఓటర్ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీ ఫుటేజీలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీన్ని బహిర్గతం చేయడం వల్ల ఓటు వేసిన వారు, వేయని వారు సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురవుతారు అని చెప్పింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈనెల 9న చనిపోయారు. దీంతో... ఈ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఇందుకు సంబంధించి శాసనసభ సెక్రటరీ గెజిట్ ఇచ్చారు కూడా. అటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి సమాచారం చేరింది.
Bhadrakali Bonalu: ప్రతిష్టాత్మకంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలు నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
Konda Surekha: ఉమ్మడి వరంగల్‌లోని కాంగ్రెస్ కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేసింది. ఈరోజు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ లో చేస్తూ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని ఆరోపించింది. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని పేర్కొనింది.
బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు.
Protocol issues: సిద్దిపేట జిల్లా దుబ్బాకకు వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనలో ప్రోటోకాల్ రచ్చ చెలరేగింది. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో చిన్నగా వేశారని గులాబీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.