Off The Record: తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతోనో, మాటలతోనో వార్తల్లో ఉండే నాయకుడు జగ్గారెడ్డి. ఎందుకో.. గత కొన్ని నెలలుగా మ్యూట్ మోడ్లోకి వెళ్ళిపోయారాయన. మాటలే కాదు.. ఆయన ఎవరికీ కనిపించడం కూడా లేదట. ఎందుకన్నది ఎవరికీ తెలియడం లేదట. అందుకే ఆ మౌనానికి అర్ధాలు, నానార్ధాలు, విపరీతార్ధాలు వెదికే పనిలో ఉన్నారట గాంధీభవన్లో కొందరు. చాలా రోజుల నుంచి మౌనముద్రలో ఉన్నారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అడపా దడపా…
S Jaishankar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. విదేశాల్లో భారత్ ను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటే అంటూ.. జాతీయ రాజకీయాలను విదేశాల్లో చర్చించడం శ్రేయస్కరం కాదని జైశంకర్ అన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యుల చేశారు. దీనిపై మీడియా జైశంకర్ ని ప్రశ్నించగా…
Smriti Irani: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘ మొహబ్బత్ కీ దుకాన్’పై ప్రేమ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై ప్రేమ ఉంటే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ఎందుకు బహిష్కరించారని ఆమె ప్రశ్నించారు. సిక్కుల ఊచకోత కోసే ప్రేమ, బొగ్గు దోచుకునే ప్రేమ, దేశాన్ని తిట్టినవారితో కరచాలనం, కౌగిలించుకునే ప్రేమ, కేరళ స్టోరీ వస్తే మాట్లాడని ప్రేమ, సెంగోల్ ని అవమానించే ప్రేమ అసలు ప్రేమ ఎలా అవుతుందని..? అని…
RSS: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్’ బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేసింది
Congress: కెనడా ఖలిస్తానీ వేర్పాటువాదులకు కేంద్రంగా మారుతోంది. భారత వ్యతిరేఖతను అక్కడ కొంతమంది సిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్ లో జరిగిన ఓ పరేడ్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని, ఇద్దరు సిక్కు బాడీగార్డులు చంపుతున్నట్లు చూపించే శకటాన్ని ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలోపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంత రావు సవాల్ విసిరారు.