Revanth Reddy : ధరణి పోర్టల్ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధరణి పోర్టల్ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని వ్యాఖ్యానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ధరణి లేకపోతే రైతు బంధు,రైతు బీమా రాదని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. ధరణిని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెబుతున్నారని, ధరణి దోపిడీపై శోధిస్తున్నాకొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయన్నారు. ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదని, కేసీఆర్ ను అసెంబ్లీ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా తప్పు లేదన్నారు. గల్ఫ్ దేశాల్లోలా కేటీఆర్ ను రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదని, ప్రభుత్వ పనిని ధరణి పేరుతో పూర్తిగా ప్రయివేటు కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు కట్టబెట్టారన్నారు.
Also Read : Defamation case: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు కోర్టు సమన్లు..
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
అంతేకాకుండా.. ‘రాష్ట్రంలో భూ లావాదేవీలన్ని ధరణి పోర్టలే నిర్వహిస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ గతంలో రూ.90 వేల కోట్లు బ్యాంకులను నిండా ముంచింది. దివాళా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్పు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు సబ్సిడరీ కంపెనీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 52శాతం వాటాను టెర్రాసిస్ కంపెనీ ఫిలిప్పీన్ కంపీని రూ.12745 కోట్లకు అమ్ముకుంది. 150 కోట్లతో వ్యాపారం చేసే టెర్రాసిస్ కంపెనీ ఫాల్కాన్ కంపెనీకి నవంబర్ 25, 2021 న రూ.1275 కోట్లకు అమ్ముకుంది. కొనుగోలు చేసెకంటే ఒక నెల ముందు మాత్రమే ఫాల్కన్ కంపెనీ ప్రారంభించారు.
Also Read :Job Insurance: ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉద్యోగాలు లేకున్నా జీతం వస్తుంది తెలుసా?
ఇప్పుడు టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపీనికి ఇచ్చేసింది. ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్ళిపోయింది. శ్రీధర్ రాజుకు, కేటీఆర్ కు ఉన్న సంబంధం ఏమిటని నేను ప్రశ్నించడం లేదు. కేసీఆర్ కు అసలు సిగ్గుందా? ఒడిశా ప్రభుత్వం 2010లో ఈ-ధరణి పేరుతో ఈ ప్రాజెక్టు లాంచ్ చేసింది. ఈ కంపెనీ నిర్వాకంపై 2017లో కాగ్ నివేదిక ఇచ్చింది. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పింది. కేసీఆర్ తానే అద్భుతాలు చేసి ధరణిని సృష్ఠించినట్టు చెప్పారు. తన దోపీడీని కప్పి పుచ్చుకోవడానికి కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. ధరణిలో ఇప్పటివరకు 25 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ.50వేల కోట్ల లావాదేవీలు జరిగాయని అంచనా.. ఇవన్నీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లడంలేదు. ఇవన్నీ శ్రీధర్ రాజు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి.
ఇక్కడే అసలు మతలబు ఉంది. రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తిరిగి డబ్బులు రావడం లేదు. మక్తల్ కు చెందిన ఆంజనేయులు గౌడ్ ఒక ఉదాహరణ. ఆన్ లైన్ లో మాత్రం డబ్బులు రిఫండ్ కావడంలేదు. ఇలా ఎన్ని వందల కోట్లు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి? అసలు ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరుతున్నాయా? ధరణిలో ఆధార్ , పాన్ వివరాల సమాచారం దేశాలు దాటి వెళుతోంది. డేటా ప్రైవసీ ప్రకారం దేశ పౌరుల డేటాను విదేశీయులు యాక్సెస్ చేయడానికి వీల్లేదు. ధరణి దోపీడీని మేం బయట పెడితే.. కేసీఆర్ కల్లు తాగిన కోతిలా ఎగురుతున్నారు.
50వేల కోట్లలో 40వేల కోట్లు ప్రభుత్వానికి వెళ్లాయని కొంత మంది అధికారులు చెబుతున్నారు. ఇది వాస్తవమా.. అవాస్తవమా విచారణ చేపట్టాలి. కేసీఆర్, కేటీఆర్ సైబర్ నేరగాళ్లు. తెలంగాణ ప్రజల సొమ్మును. దోచుకున్నారు.
ధరణిలో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. తక్షణమే ధరణి లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కాగ్ నివేదిక కోరాలని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. సీసీఎల్ఏ కమిషనర్, చీఫ్ సెక్రెటరీ, సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. దీనిపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం…. అవసరమైతే కోర్టు తలుపు తడతాం. దోపిడీ బయటపడుతుందనే నా ఆరోపణలపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తున్నారు. అందుకే కేసీఆర్ రైతులను, ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి అనేది కేవలం సాఫ్ట్ వేర్ మాత్రమే కాదు… అది కేసీఆర్ దోపిడీకి గేట్ వే.. లోపాలు లేకుంటే కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దోషిగా నిలబడింది? ధరణి మాస్టర్ కీ శ్రీధర్ రాజు దగ్గర ఉంది. తెలంగాణ భూమిలన్నీ ఆంధ్రా శ్రీధర్ రాజుకు కట్టబెట్టారు. శ్రీధర్ రాజు ఏ యువరాజుకు దగ్గరి వాడో తేలాలి. చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలి. లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నా కేంద్రం కేసీఆర్ పై ఎందుకు విచారణకు అదేశించడంలేదు? దీని వెనక ఏ గూడుపుఠానీ ఉందో కేంద్ర పెద్దలే చెప్పాలి.’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..