Kerala Rename: కేరళ పేరును ‘‘కేరళం’’గా ఎందుకు మార్చారు.. పరశురాముడి నుంచి కొబ్బరిచెట్ల వరకు అనేక కథలు..
- కేరళ పేరు ఇకపై ‘‘కేరళమ్’’..
- పేరు మార్పు వెనక భౌగోళిక, చారిత్రక కారణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Rename: కేరళ రాష్ట్రం పేరును ‘‘కేరళమ్’’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఎళ్లుగా కేరళ ప్రజల కల ఈ రోజుతో నెరవేరింది. కేరళను ఎందుకు కేరళమ్‌గా మార్చారని చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి అనేక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. జూన్ 24, 2024న కేరళ రాష్ట్ర అసెంబ్లీ తమ రాష్ట్రం పేరును ‘‘కేరళమ్’’గా మార్చాలని ఒక తీర్మానాన్ని పాస్ చేశాయి. భాషా ప్రతిపదికన నవంబర్ 1, 1956లో ఏర్పడిన రాష్ట్రాల్లో మలయాళం మాట్లాడే కేరళ కూడా ఒకటి. ఆ సమయంలోనే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో ‘‘కేరళ’’గా రాష్ట్రం పేరును రాశారు. నిజానికి మలయాళంలో రాష్ట్రం పేరును ‘‘కేరళమ్’’గా పిలుస్తారు. కానీ ఇంగ్లీషులో కేరళగా పిలుస్తారు.
పరుశురాముడి కథ:
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
విష్ణువు యొక్క ఆరో అవతరామైన పరశురాముడికి కేరళకు ప్రత్యక్ష సంబంధం ఉంది. దుష్ట క్షత్రియుల్ని అంతం చేసిన తర్వాత, పరశురాముడు భారీ యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞంలో తాను గెలుచుకున్న భూమిని మొత్తం శివుడికి దానం ఇస్తాడు. తన భూమినంతా దానం చేసిన తర్వాత, పరశురాముడు తపస్సు, ఇతర ఆచారాల కోసం కొంత భూమిని కోరుతాడు. దానం చేసినదాంట్లో ఏలాంటి భూమిని కూడా తీసుకోలేకపోయాడు.
అదే సమయంలో వరణుడు పరశురాముడిని సముద్ర తీరానికి తీసుకెళ్లి.. ‘‘నీరు కావాల్సిన భూమి తీసుకో. అంత వరకు సముద్రం వెనక్కి వెళ్లి భూమి వస్తుంది’’ అని చెబుతాడు. పరశురాముడు తన గొడ్డలిని విసిరిన తర్వాత సముద్రం నుంచి భూమి బయటకు వస్తుంది. ఈ ప్రదేశమే నేటి కేరళగా చెబతారు. మలయాళంలో కేర అంటే నీరు, ఆలం అంటే భూమి. నీటి నుంచి ఉద్భవించిన భూమి అని అర్థంగా కేరళమ్ అని పిలుస్తారు.
అశోకుడి శిలాశాసనం:
చరిత్ర ఆధారాలను పరిశీలిస్తే, క్రీస్తుపూర్వం 3వ శతాబ్ధానికి చెందిన మౌర్య చక్రవర్తి అశోకుడు తన శిలాశాసనాల్లో ఈ ప్రాంతాన్ని ‘‘కేరళపుత్ర’’ అని సంబోధించారు. అంటే కేరళ పాలకుడు అని అర్థం
చేర వంశం నుంచి కేరళమ్:
దక్షిణ భారత చరిత్రకారులు ‘‘కేరళమ్’’ అనే పేరును చేర వంశంతో ముడిపెడుతున్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన చేర వంశం ఆధారంగా పేరు వచ్చినట్లు చెబుతున్నారు. చేర పేరు నుంచి ‘‘చేరళం’’గా ఉద్భవించి, కాలక్రమేణా ఇది ‘‘కేరళమ్’’గా మారినట్లు చెబుతారు. ద్రావిడ భాషల్లో క,చ అక్షరాలు మారుతుంటాయి.
కొబ్బరి చెట్ల భూమి:
కేరళలో అంటేనే కొబ్బరి చెట్లు గుర్తుకు వస్తాయి. మలయాళంలో ‘కేర’ అంటే కొబ్బరి చెట్లు అని అర్థం. ‘అలం’’ అంటే స్థలం అని అర్థం. దీని ద్వారా కొబ్బరి చెట్ల నేలగా ‘‘కేరళమ్’’ అనే పేరు రావచ్చని చెబుతున్నారు. ఇది భౌగోళిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!