Andhra Pradesh Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 56 అజెండా అంశాలకు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 56 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడులు, పర్యాటకం, ఇంధన ప్రాజెక్టులు, ఉన్నత విద్య, పరిశ్రమలు వంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో రూ. 2,387 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ పరిశ్రమకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.
పర్యాటక రంగానికి ఊతం
విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా, చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు ఇచ్చింది. ఇక, సౌర, పవన మరియు హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇక, ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖల బలోపేతానికి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు అందించే దిశగా చర్యలు చేపట్టనుంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
భూకేటాయింపులు, కొత్త శాఖ
వివిధ సంస్థలకు భూకేటాయింపుల అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేబినెట్.. Kolleru Lake అభయారణ్య సరిహద్దుల ఖరారుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. మొత్తంగా, పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమల అభివృద్ధి, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు మరియు విద్యాభివృద్ధిపై ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!