Lord Hanuman: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారాయి. మధ్యప్రదేశ్ మాజీ అటవీ శాఖ మంత్రి, ధార్ జిల్లా గంద్వానీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమర్ సింఘార్.. ‘హనుమంతుడు ఆదివాసీ’ అని అన్నారు. ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. విదేశాలకు వెళ్లి సొంతదేశాలను విమర్శించడం ఏ పార్టీ అధినేతకు కూడా తగదని రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. భారత్‌పై దుష్ప్రచారం చేయడానికే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని ఆరోపించిన అమిత్ షా.. తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని సూచించారు.
రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం..పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఈ నెల 11న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. సచిన్ పైలట్ ఏ పార్టీ పెట్టడంలేదని, అదంతా అసత్య ప్రచారం.. ఒట్టి పుకార్లు మాత్రమేనంటూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతవరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టగా.. ప్రతిపక్షాలు తమదైన శైలిలోకి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్‌కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అంటూ.. హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు.
White House: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇప్పటికి మొత్తం మూడు అమెరికన్ నగరాలను సందర్శించారు. రాహుల్ వైట్‌హౌస్‌ను సందర్శించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.