జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామం వద్ద జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గ్రామస్థులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం జరగదు అని మీరు నిరూపిస్తే నేను కోర్టులో ఉన్న నా ఎలక్షన్ పిటిషన్ ను వెనక్కి తీసుకొంటానని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి అన్ని శాఖల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత నే పాశిగామ గ్రామస్థులను కలిసి వారితో మాట్లాడటం జరిగిందని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు
Also Read : Volvo C40 Recharge: వోల్వో నుంచి మరో ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్‌తో 530 కి.మీ.
అంతేకాకుండా.. ‘మంత్రి కొప్పుల ఈశ్వర్ తేదీ, సమయం చెప్పండి మీరు మేము అందరం కలిసి ఈ ఫ్యాక్టరీ ఉన్న పర్లపెల్లి ,నారాయణఖేడ్ కి వెళ్లి అక్కడ ప్రజలను ఈ ఫ్యాక్టరీ గురించి అడిగి తెలుసుకుందాం. షుగర్ ఫ్యాక్టరీ నీ తెరిపిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించడం జరిగింది.. సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో ధర్మపురిని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మంత్రి లేదు కానీ, ఇతర పార్టీల నుండి నాయకులను ఏ విధంగా పార్టీలోకి తీసుకురావాలనే దాని పైన ఆలోచన ఉంటుంది. మంత్రి పై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే జీతాలు ఇచ్చి మరి సోషల్ మీడియాలో వారి పైన విషప్రచారం చేయించడం జరుగుతుంది. 2004 ముందు మంత్రి ఈశ్వర్ గారి ఆస్తులు ఎంత..? 2023 నాటికి ఆస్తులు ఎంతనో ప్రజలకు తెలపాలి.. జగిత్యాలలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన మంత్రికొప్పుల ఈశ్వర్ జీవన్ రెడ్డి సవాల్ నీ స్వీకరించి తేదీ, సమయాన్ని చెప్పాలని అంటే మంత్రి ఎందుకని నోరు మెదపడం లేదు.. కాలేశ్వరం లింక్ పేరిట ఈ ప్రాంతంలో 700 ఎకరాల మూడు పంటలు పండే భూములను పోలీసులను, అధికారులను పెట్టి రైతులను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా వారి నుండి లాక్కున్నారు.. ఇథనాల్ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలకు నిజంగా మేలు కలుగుతుందంటే గ్రామ ప్రజలకు తెలియకుండా పనులను ప్రారంభించాల్సిన అవసరం ఏముందో మంత్రి చెప్పాలి.’ అని ఆయన అన్నారు.
Also Read : Pawan Kalyan: జనసేనకి అధికారం కట్టబెట్టండి.. నచ్చకపోతే నేనే రాజీనామా చేస్తా