Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో పెట్టిన సభ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏపీ పై కూడా దృష్టి సారించింది. ఆ దిశలోనే అడుగులు వేస్తోంది.
హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో 8న వరంగల్లో ప్రధాని పర్యటన పైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, అరూరి రమేష్, నన్నపనేని నరేందద్, తాటికొండ రాజయ్య లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడారని ఆయన అన్నారు.
డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. భట్టి పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నామన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన సభకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సభకు ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు పార్టీ నేతలు, క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు లేవు.. సర్దుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. కేసీఆర్ వ్యవహరం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.