బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి ప్రకటించారు. విలువలు లేని చోట తాను ఉండలేనని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రియాంకగాంధీ త్వరలోనే నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నట్లు దామోదర్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడ ఆయన రాజీనామా చేయనున్నారు.
వరంగల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు పార్టీ పటిష్టత కోసం కమలనాథులు తెలంగాణలో వరుస సమావేశాలు, పర్యటనలు చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ పార్టీ మారుతున్నారనే ప్రచారంతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇవాళ (ఆదివారం) ఆయన నివాసానికి వెళ్లి ఇద్దరు కాసేపు చర్చించుకున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరో నాటకానికి తెర దీసింది అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం మీటింగ్ సందర్భంగా బీఆర్ఎస్ అరాచకాలు చేసింది.. బీఆర్ఎస్ అరాచకం వల్లనే సభ గ్రాంఢ్ సక్సెస్ అయ్యింది అని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వున్న కిషన్ రెడికే బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హైకమాండ్ నియమించింది అని తెలిపింది. ఇదే బీఆర్ఎస్, బీజేపీ అనుబందంపై పూర్తిగా అర్థమవుతుందని రేణుకా చౌదరి చెప్పారు. బీఆర్ఎస్ కు కరెంట్…
Digvijaya Singh: కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశారు. దీనిపై ఆయనపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సలహా మేరకే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో పొత్తు పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ శనివారం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వమే ఏకైక మార్గమని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని ఆయన తెలిపారు. కేసీఆర్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నడనే బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి తప్పించారు అని హనుమంతరావు అన్నారు. అబ్కీ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆయన తెలిపారు..
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగుతున్న నేపథ్యంలో తాను మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే ఖండించారు. రాష్ట్రంలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, మాట్లాడేందుకు భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.