యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల వద్ద నేషనల్ హై వే నిర్మాణ పనులను పరిశీలించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 45 రోజుల్లో ప్రభుత్వం రద్దు కాబోతోందన్నారు. జాతీయ రహదారులు ఎప్పుడు అయిన స్థానిక ఎంపీల అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అది కూడా తెలియని కేటీఆర్ అమెరికాలో చదువుకొని వచ్చాడని ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియా, వైన్ మాఫియాలో, గల్లీల్లో తిరిగే గాదరి కిషోర్ కి ఢిల్లీ ఎక్కడుందో తెలుసా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెద్దెవ చేశారు.
Also Read : Flower Farming: పూల సాగుతో లాభాలెన్నో.. తక్కువ శ్రమ, ఎక్కువ డబ్బులు..!
జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అక్రమంగా సంపాదించిన 3 వేల కోట్లతో శంషాబాద్ దగ్గర 80 ఎకరాల భూమి కొన్నాడని, అక్రమ సంపాదనలో గాదరి కిషోర్, జగదీశ్ రెడ్డి తో పోటీపడుతున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి బెంజ్ కారులో తిరుగుతాడు అని నన్ను విమర్శిస్తున్నారని, నేను 30 సంవత్సరాల క్రితం యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడే బెంజ్ కారు లో తిరిగానన్నారు. కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించాను, కానీ స్కూటర్ మీద తిరిగిన జగదీష్ రెడ్డి లాగా అక్రమంగా వేల కోట్లు సంపాదించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Flower Farming: పూల సాగుతో లాభాలెన్నో.. తక్కువ శ్రమ, ఎక్కువ డబ్బులు..!
అక్రమాలు ఆగాలన్నా, తెలంగాణ లూటీ ఆగాలన్నా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలన్నారు. ఐటీ మినిష్టర్ అయ్యిండి కూడా కేటీఆర్ జ్ఞానం లేకుండా మాట్లాడుతుండని ఆయన మండిపడ్డారు. ఈ నెల 20వ తేదీన కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ పాల్గొన బోయే సభ లో బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నామని కోమిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.