Uniform Civil Code: కేంద్రం ఈ పార్లమెంటరీ సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లు ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చించనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ ఈరోజు సమావేశం కానుంది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బీఆర్ఎస్ సర్కారును కదిలించింది. ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం కేసీఆర్ ను ప్రజల వద్దకు పరుగులు తీసేలా చేసింది. పోడు భూముల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఈనాడు పట్టాలు పంపిణీ చేయడం పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై భట్టి చేసిన పోరాట ఫలితమే. ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో సరికొత్త ప్రజా విప్లవోద్యమంలా మారింది.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం నాడు ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించింది. మార్చి 16న ప్రారంభమైన ఈ పాదయాత్ర మూడు నెలల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకుంది.. breaking news, latest news, telugu news, bhatti vikramarka, brs, congress,
Amit Shah: రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో స్కామ్‌లు, అవినీతి పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి విమర్శించారు. నరేంద్రమోడీ మళ్లీ అధికారంలోకి వస్తే మోసగాళ్లంతా కటకటాల పాలవుతారని శుక్రవారం అన్నారు. గతేడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే,
భట్టి పాదయాత్ర చరిత్రాత్మక విషయమని వీహెచ్ కొనియాడారు. భట్టి పట్టుదలతో పని చేస్తున్నారని తెలిపారు. బీసీ ప్రధాని అయినా.. బీసీల కోసం ఏం చేశాడని ప్రశ్నించారు. కులాల వారిగా జనాభా గణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారని వీహెచ్ అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని.. ఖమ్మంలో 10 సీట్లు కాంగ్రెస్ దే అన్నారు. రేవంత్, భట్టి కలిసి పని చేయాలని ఆయన అన్నారు.…
Uniform civil code: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ ‘యూనిఫాం సివిల్ కోడ్’ (యూసీసీ)పై భోపాల్ లో ఓ సభలో కామెంట్స్ చేసినప్పటి నుంచి దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ముస్లిం వర్గాల నుంచి దీనిపై ప్రధానంగా వ్యతిరేకత వస్తోంది. అయితే ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని అన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూసీసీని తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడిగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఐసిసి సంస్ధాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఛత్తీస్ ఘడ్ వ్యవహారాల పై సమీక్ష సమావేశం ముగియగానే రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది.
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు రూ.25కోట్లు చొప్పున, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని.. దాంట్లో అనుమానమే లేదన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకం కావటం.. వారి సమస్యల పైన…