జనగామ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం వల్ల ప్రజలు బాధపడుతున్నారన్నారు. రైతులకు రుణమాఫీ ఇవ్వడం లేదని, సకాలంలో రుణాలు ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ధరలు ఈ 9 సంవత్సరాలలో విపరీతంగా పెరిగాయి, కానీ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే పనులు చేయలేదని ఆయన మండిపడ్డారు.
Also Read : Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థ లేనపుడు దేశం ఆగిపోలేదు.. జనసేనాని కామెంట్స్
ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గిన దేశంలో,రాష్ట్రంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ట్యాక్స్ వేసి విపరీతంగా పెంచారని ఆయన ధ్వజమెత్తారు. ఈ రాజకీయ పార్టీలు దేనికోసం పని చేస్తున్నాయని, దేశంలో పేద ప్రజలను పట్టించుకోకుండా, రాజకీయాలే ప్రధాన అంశం అయ్యాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 57 సంవత్సరాలలో పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ని ప్రజల కోసం అడిగే అర్హత కూడా లేదా ఈ ప్రజాస్వామ్యంలో అని ఆయన దుయ్యబట్టారు.
Also Read : Israel: న్యాయ సంస్కరణలకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజల ముందు ఉంచండి, చర్చకు పెట్టండని ఆయన అన్నారు. మోడీ మన రాష్ట్రానికి వచ్చి సభ నుంచి వర్చువల్ గా ప్రారంభించడం సరైందా… దేశంలో ప్రజలు శిక్షిస్తారు, మోడీని తీహార్ జైల్లో, కేసీఆర్ ని చంచల్ గూడ జైల్లో వేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.