ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిందని, తమ నాయకుడు పాదయాత్ర పూర్తి చేసుకోవడం పెద్ద ఎత్తున చేరికలు ఉండడంతో ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఆయన మాట్లాడుతూ.. స
కాంగ్రెస్ సభపై ఆంక్షలు తగదు.. ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న జనగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదు.. రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి..?
ప్రజల కోసం ప్రజా సమస్యల మీద దేశం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే.. బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక ఎక్కడికక్కడ నిర్బంధంతో చెక్ పోస్ట్ లు పెట్టి నిర్భందిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు.
ఇవాళ సాయంత్రం ఖమ్మంలో జరిగే జనగర్జన సభను ఫెయిల్ చేయాలని అధికార పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాల్గొంటున్నందున సభను నిర్వహించనివ్వద్దని కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ నేడు జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు.
Times Now Navbharat Survey: దేశంలో నరేంద్రమోడీ హవా తగ్గలేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. 2024 లోకసభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా.. కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుందరంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ లతో అలంకరించారు. పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
Uniform Civil Code: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘ యూనిఫాం సివిల్ కోడ్’(యూసీసీ) బిల్లును ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.