వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
కేంద్రంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు బుధవారం నోటీసులు ఇవ్వగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు. 2019లో అలాంటి తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
తెలంగాణలో సుమారు 50 లక్షల మందికి పైగా మహిళలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అభయహస్తం, బంగారు తల్లి పథకాలు ఎక్కడికి వెళ్ళాయని, దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారన్నారు. డ్వాక్రా రుణాలు కట్టాలని మహిళలను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, పాల్వంచలో కెటిపీఎస్ ను కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేశామని ఆమె మండిపడ్డారు. Breaking…
మణిపూర్లో జాతి హింసపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. కాంగ్రెస్ మణిపూర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ బీరెన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మణిపూర్లో శాంతిస్థాపన దిశగా ఉద్యమం ఉండదని కాంగ్రెస్ ఆదివారం పేర్కొంది.
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని, పార్టీ గెలిస్తే, సీఎం పదవికి పరిగణించబడే వరుసలో బఘేల్ మొదటి స్థానంలో ఉంటారని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ఆదివారం అన్నారు.