MP Komatireddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులతో పాటు ఇతర సీనియర్లను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు.
ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోందని.. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.
దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది.
బెంగళూరు వేదికగా విపక్షా కూటమి రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు.
రాబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో అన్నారు.
Sonia Gandhi: లోక్సభ ఎన్నికలకు ముందు బెంగళూరులో బీజేపీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ విపక్షాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి 26 పార్టీల నేతలు చేరుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ కూడా సోమవారం బెంగళూరు చేరుకున్నారు.
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అంధకారంలోకి వెళ్లిపోతుందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం అన్నారు. జిల్లాలోని అంగడిపేట రైతు వేదిక వద్ద జరిగిన రైతు సమావేశానికి హాజరైన సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు వ్యవసాయాన్ని శాపంగా భావించాయన్నారు. breaking news, latest news, telugu news, big news, congress, gutha sukender reddy, brs,
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్ష నేతల తొలి రోజు సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై దాదాపు రెండు గంటలకు పైగా నేతలందరూ చర్చించారు. రేపు (మంగళవారం) మరోసారి భేటీ కానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని నిలువరించే అంశాలతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు.