Minister Puvvada Ajay Kumar Slams Congress Guarantee Cards: సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ కార్డులను కనుక నమ్మితే.. ముందుకెళ్లిన తెలంగాణ మళ్లీ వెనక్కి వస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పాలనలోనే తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ కోటాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్నారన్నారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్‌పై కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల అనంతరం సభలో పాల్గొన్నమంత్రి పువ్వాడ హాట్ కామెంట్స్ చేశారు.
‘తెలంగాణలో ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాధాయపడుతున్నారు. గడచిన 50 ఏళ్లలో 10, 11 అవకాశాలు ఇచ్చినా ఏం చేశారు?.. దేశాన్ని సంకనాకిచ్చారు. కాంగ్రెస్ పరిపాలనలో నేతన్నలు ఉరికంబాల పాలయ్యారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పాలనలోనే తీవ్ర అన్యాయం జరిగింది. ఆ కోటాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ కార్డులను నమ్మితే.. ముందుకెళ్లిన తెలంగాణ మళ్లీ వెనక్కి వస్తుంది’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Also Read: Mosquitoes: ఇంట్లోకి దోమలు వస్తున్నాయా? ఈ చెట్లు పెంచండి.. రమ్మన్నా రావు
‘సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు పిచ్చి గ్యారంటీలు. వీటిని అమలు చేయాలంటే రెండు లక్షల 57 వేల కోట్లు అవసరం. అవి ఎక్కడ నుంచి తీసుకొస్తారు?. కర్ణాటకలో ఉచిత ప్రయాణం అని పెడితే అక్కడ మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవకముందే కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి’ అని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.