Himanta Biswa Sarma: సోనియాగాంధీపై విద్వేష వ్యాఖ్యలు.. అస్సాం సీఎంపై ఎఫ్ఐఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అస్సాం కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో హిమంతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సాం ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన దేబబ్రత సైకియా ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలో ఎన్నికల ప్రచారంలో ‘జన ఆశీర్వాద ర్యాలీ’లో పాల్గొన్న హిమంత బిశ్వసర్మ సోనియా గాంధీపై విద్వేశపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌ని తగలబెట్టాలని అస్సాం సీఎం పిలుపునిచ్చారని సైకియా ఆరోపించారు. విదిషా ర్యాలీలో హిమంత ఈ వ్యాఖ్యలు చేసినందుకు తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని సైకియా తెలిపారు. ఆ ర్యాలీలో హిమంత మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ హనుమంతుడి భక్తుడైతే, హనుమంతుడు లంకను తగలబెట్టిన విధంగా 10 జన్‌పథ్‌ని తగలబెట్టాలి’’ అని పిలుపునివ్వడం వివాదాస్పదం అయింది.
Also Read
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
- Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
Read Also: Wipro: విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దాలా రాజీనామా..
చట్టపాలన ఉన్న దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదని కాంగ్రెస్ నేత సైకియా అన్నారు. సోనియాగాంధీ పార్లమెంటులో సీనియర్ సభ్యురాలు, కాంగ్రెస్, యూపీఏలకు ప్రాతినిధ్యం వహించారని, ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నానని, అస్సాం ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి మాటు వస్తాయని అనుకోలేదని సైకియా అన్నారు.
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వరసగా నాలుగు సార్లు బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంటోంది. ఈ సారి ఎలాగైనా బీజేపీని, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ని గద్దె దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కీలకం కానున్నాయి. మధ్యప్రదేశ్ తో పాటు చత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!