MLC Jeevan Reddy : దరఖాస్తులు స్వీకరించకుండా దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా కేంద్రం లోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతుంది భారత రాజ్యాంగమా.. బీఆర్ఎస్ రాజ్యాంగమా అని ఆయన అన్నారు. దరఖాస్తులు స్వీకరించకుండా దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో చెప్పాలన్నారు. దళిత బంధు ఎమ్మెల్యే బందుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. జీ ఓ 8 లో పేర్కొన్నట్లుగా ప్రజా ప్రతినిధులు అంటే ఎవరో కలెక్టర్ స్పష్టత నివ్వాలని, కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీ సీ బంధు, మైనారిటీ బంధు, దళిత బంధు అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. 2018 నుండి గృహ నిర్మాణ కార్యక్రమాలు, దళితులు, బలహీన వర్గాల స్వయం ఉపాధి పథకాలు పూర్తిగా స్తభింపజేశారన్నారు.
Also Read : Rahul Dravid: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి అందుకోసమేనట..!
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
అంతేకాకుండా.. ‘2018 నుండి డబుల్ బెడ్రూం పథకం పూర్తిగా నిలిపి వేశారు. పదేళ్ల లో గృహ నిర్మాణ వ్యయం రెట్టింపు కాగా ఇంటి నిర్మాణం కోసం రు. 10 లక్షలు ఇవ్వాల్సిందిపోయి రు. 3 లక్షలు ఇస్తామంటున్నరు. దళిత బంధు ఎమ్మెల్యే బంధు గా మారింది, రాష్ట్రంలో కొనసాగుతుంది భారత రాజ్యాంగమా…బీ ఆర్ ఎస్ ప్రత్యేకంగా ఏదైనా రాజ్యాంగం అమలు చేస్తున్నారా…. ఆశావహుల నుండి ధరఖాస్తులు స్వీకరించకుండా దళిత బంధు లబ్దిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు. దళిత బంధు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తున్నారో తేలియక దళిత సమాజం ఆందోళన చెందుతోంది.. రాజ్యాంగం లో ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్య పరిరక్షణ లో కీలకమైన పాత్రికేయుల ద్వారానైనా లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో ప్రకటించారా…. దళిత బంధు విధి విధానాలు ఏమిటో చెప్పాలన్నారు. జగిత్యాల జిల్లా పారదర్శకతకు ఆదర్శంగా నిలిచే జిల్లా క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు అంటే ఎవరో స్పష్టత ఇవ్వాలి అని జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Also Read : Rahul Dravid: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి అందుకోసమేనట..!
కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గృహ నిర్మాణ కోసం స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణం కోసం రు.5లక్షలు ఇస్తాం. సిలిండర్ ధర ఎంత ఉన్నప్పటికీ రు.500 లకే అందజేస్తాం.. ప్రతి మహిళకు రు.2,500 ఉచిత రవాణా సౌకర్యము కల్పిస్తాం.. వరి ధాన్యం మద్దతు ధర పై అదనంగా రు.500 చెల్లిస్తాం.. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తాం.. విద్యా జ్యోతి కింద విద్యార్థులు ఉన్నత చదువులకు రు.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం.. కాంగ్రెస్ గ్యారంటీ కార్డు.. ప్రజల హక్కు పత్రం.. ఇంటి ఇంటికి కాంగ్రెస్ గ్యారంటీ తీసుకెళ్తాము. బీఆర్ ఎస్ అనాలోచిత విధానంతో మిషన్ భగీరథ పేరిట 50 వేల కోట్ల ఆర్థిక భారం ప్రజల పై మోపారని విమర్శించారు. ఎన్ టీ పీ సీ లో 4000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నా ఎందుకు యాదాద్రి నిర్మిస్తున్నారు..’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!