రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు.
Himanta Biswa Sarma: పాలస్తీనాకు మద్దతు ఇస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానంపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటన పాకిస్తాన్, తాలిబాన్ ప్రకటనల్ని పోలి ఉందని ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేంత వరకు మీడియా సంయమనం పాటించాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయని ఆయన వెల్లడించారు. breaking news, latest news, telugu news, big news, revanth reddy, congress
Bigg Boss: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు వివాదంగా మారాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయడంతో దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా రియాలిటీ షోలోకి ప్రవేశించినట్లుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి.
5 రాష్ట్రాల ఎన్నికలకు ఎల క్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా కీలకం కాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు.. breaking news, latest news, telugu news, harish rao, congress, big news,
CPM has no relation with BRS Says CPM Leader Tammineni Veerabhadram: తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. దేశంలో కుల గణన పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తుందని, ఇండియా కూటమి మాత్రమే దేశంలో కుల గణన చేయగలదన్నారు. బీజేపీ పార్టీ వ్యతిరేక పార్టీలతో తమకు కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామని వీరభద్రం తెలిపారు.…
CPl Narayana about Congrss Alliance: తమని కాదని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుదిరిందని, సీట్ల సర్దుబాటు ఇంకా కుదరాల్సి ఉందన్నారు. కమ్యూనిస్టులది విశాల హృదయం అని, చట్ట సభల్లో తమ వాయిస్ ఉండాలనేదే ఆలోచన అని నారాయణ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల గురించి చర్చలు జోరుగా జరుగుతున్నాయి.…
కాంగ్రెస్ తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని వెల్లడించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయితే.. సీట్ల అంశం మాత్రమే తేలాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, cpi narayana, big news, congress,
దేశవ్యాప్తంగా కులగణనకు ఇవాళ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రాహుల్ వ్యాఖ్యానించారు.