Off The Record: కామారెడ్డిలో కేసీఆర్ ని ఢీకొట్టడానికి కాంగ్రెస్ భారీ వ్యూహం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కాంగ్రెస్ అభ్యర్థుల మలివిడత జాబితా పై ఉత్కంఠ పెరుగుతోంది. తొలి లిస్ట్‌లో 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది పార్టీ. కానీ… అందులో అందరూ ఊహించిన కామారెడ్డి లేకపోవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్టీలో కీలకమైన నేత, మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ సాధించిన షబ్బీర్ అలీ పేరు ఫస్ట్ లిస్ట్‌లో లేకపోవడంపై ఆశ్చర్యపోయాయి పార్టీ వర్గాలు. మొదట్నుంటి కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ.. షబ్బీర్ అంటే కామారెడ్డి అనిచెబుతోంది కాంగ్రెస్. కానీ… లిస్ట్‌లో పేరు లేకపోవడం ఏంటో అంతు చిక్కడం లేదట పార్టీ నేతలకు. దీన్ని బట్టి చూస్తే… సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి విషయంలో కాంగ్రెస్ పరంగా సంచలన నిర్ణయాలు ఉంటాయా అన్న సందేహాలు పెరుగుతున్నాయట. గజ్వేల్, కామారెడ్డి రెండు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్. గజ్వేల్ లో ఆయన మీద బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తానంటున్నారు. కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి కూడా బలమైన నాయకుడే.
Also Read: Elon Musk X: ఇకపై ‘ఎక్స్’ ఉచితం కాదు.. డబ్బులు కట్టాల్సిందే!
Also Read
ఇక కామారెడ్డి విషయంలో కూడా కాంగ్రెస్ లోతుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కెసిఆర్ పై పోటీ చేసే అభ్యర్థి కోసం డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. జహీరాబాద్ లోక్‌సభ సీటు నుంచి గతంలో పోటీ చేసిన మదన్మోహన్రావును బరిలో నిలిపే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. కెసిఆర్.. మదన్మోహన్రావు ఇద్దరు ఒకే సామాజిక వర్గం అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతోపాటు మరో చర్చ కూడా నడుస్తోంది. వాళ్ళు వీళ్ళు కాకుండా… ఏకంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డే కామారెడ్డి బరిలో దిగే అవకాశం ఉందన్నది కాంగ్రెస్ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.దీన్ని బట్టి చూస్తే… కేసీఆర్‌ని రెండు నియోజకవర్గాల్లో కట్టడి చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనవిపిస్తోందంటున్నారు. రేవంత్ రెడ్డి గనుక కామారెడ్డిలో పోటీ చేస్తే గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా… పోటీ మాత్రం యమా రంజుగా ఉంటుంది. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మంచి ఇమేజ్ ఉంది. వరుసగా ఓడిపోయారన్న సానుభూతి కూడా ఆయనకు ప్లస్ కావచ్చంటున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నా..వేరే ఆలోచన లేకుండా… తన పని తాను చేసుకుంటూ పోతున్నారాయన. అందుకే… షబ్బీర్ బరిలో ఉంటే సానుభూతి వర్కౌట్ అవుతుందని…పార్టీ వేరే ఆలోచన చేసినా అది అంతగా కలిసి వస్తుందా ? లేదా అన్న మరో చర్చ కూడా నడుస్తోంది. అటు ఈ మొత్తం ఎపిసోడ్లో షబ్బీర్ అలీ కాస్త సంయమనాన్ని పాటిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏముంది? కామారెడ్డి బరిలో నుంచి దిగేది ఎవరన్నది చూడాలి.
తాజావార్తలు
-
Mohammed Shami: బుమ్రాకు ఒక న్యాయం, షమీకి మరో న్యాయమా?.. బీసీసీఐని నిలదీసిన కైఫ్!
-
CM Chandrababu: ఓటు ఒక ఆయుధం.. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం
-
IPCC: 1000మంది సైంటిస్టులు..100 గంటలు.. ఒక్కటే తీర్పు.. ముందుంది ముసళ్ల పండగ!
-
Annamalai: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. అన్నామలై కీలక ప్రకటన..
-
Hair Oiling Tips: తలస్నానం చేయడానికి ముందు నూనె రాయాలా? లేక తర్వాత రాయాలా? డౌట్ క్లియర్ చేసుకోండి..
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!