దేశంలో దీపావళి ముగిసింది. కానీ జార్ఖండ్లో మాత్రం పొలిటికల్ టపాసులు పేలుతున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోమవారం ప్రధాని మోడీ.. హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై విరుచుకుపడగా.. మంగళవారం కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. అందులో బలహీనుడి గళం. సామాజిక న్యాయ రణం.. రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ రాసుకొచ్చారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు రానున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు బరిలో నిలుచున్నదెవరో తేలిపోయింది. ఇక ప్రచార రంగంలోకి అభ్యర్థులు దిగనున్నారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇదిలా ఉంటే మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది
జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ప్రధాని మోడీ గర్వాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై మోడీ నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు.
ఈ దేశంలో, జార్ఖండ్ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని ఏఐసిసి సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
ట్విట్టర్( X) వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ మొత్తాన్ని మోసం చేశావని, మీ “గ్యారంటీలు” చక్కటి ముద్రణ , ఖాళీ వాగ్దానాలతో నిండి ఉన్నాయి. మీరిచ్చిన గ్యారంటీ కార్డు లో షరతులు వర్తిస్తాయని విషయం తెలంగాణ అమాయక ప్రజలకు తెలియదన్నారు బండి సంజయ్.
TVK Party: తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు.