IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ధర్మశాలలో కురిసిన భారీ వర్షం కారణంగా టాస్ పడటంలో 3 గంటల 45 నిమిషాల ఆలస్యమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను చెరి 25 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది.
తడబడిన అఫ్గాన్ – నిలబెట్టిన గుర్బాజ్..
ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్తాన్ జట్టుకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. పవర్‌ప్లేలోనే కేవలం 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గుర్నూర్ బ్రార్ తన రెండో ఓవర్లోనే ఇబ్రహీం జద్రాన్ (1) ను అవుట్ చేయగా, అర్ష్‌దీప్ సింగ్ వరుస ఓవర్లలో సెదికుల్లా అటల్ (0), రహ్మత్ షా (4)లను పెవిలియన్ చేర్చాడు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఈ దశలో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసి, అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతను మొత్తం 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (27 పరుగులు) తో కలిసి నాలుగో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే నితీష్ కుమార్ రెడ్డి గుర్బాజ్‌ను బౌల్డ్ చేయడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. భారత డెబ్యూ బౌలర్ హర్ష్ దూబే అద్భుతంగా బౌలింగ్ చేసి షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ (26), అల్లా గజన్ఫర్ (0) వికెట్లను పడగొట్టాడు. చివరి ఓవర్లో గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ (9), జియా ఉర్ రెహ్మాన్ (4) లను అవుట్ చేయడంతో అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు, అర్ష్‌దీప్, నితీష్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.
రోహిత్ శర్మ సరికొత్త రికార్డు..
భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలను ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భారత్ తరఫున వన్డే బరిలోకి దిగిన అతి పెద్ద వయసు కలిగిన ఆటగాడిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అతను 39 ఏళ్ల 44 రోజుల వయసులో ఈ మ్యాచ్ ఆడి, మోహిందర్ అమర్నాథ్ (37 ఏళ్ల 29 రోజులు) పేరిట ఉన్న 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.
భారత్ ఛేజింగ్ – గిల్ అద్భుత బ్యాటింగ్..
195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 46 పరుగులు జోడించాక రోహిత్ శర్మ (16) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్) చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కాగా, శ్రేయస్ అయ్యర్ 12 పరుగులు చేసి నిష్క్రమించాడు.
మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాడు. అతను 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ 22.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి, 13 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..