Arvind Kejriwal: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమిలో లుకలుకలకు కారణమవుతోంది. ఇతర మిత్ర పక్షాలు కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ పార్లమెంట్‌లో కాంగ్రెస్ విధానంపై మండిపడుతోంది. సభని సరిగా జరగనివ్వాలని కోరుతోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో విభేదాలు స్పష్టం కనిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ వర్సెస్ ఆప్‌గా అక్కడ పోరు నెలకొంది. ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా ఇతన ఇండియా కూటమిలోని మరే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో పొత్తులను తోసిపుచ్చారు.
Read Also: Bangladesh: హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి.. భారత్ ఎజెంట్ అంటూ ఆరోపణ..
లోక్‌సభ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా ఢిల్లీలోని అన్ని ఎంపీ స్థానాల్లో ఓడిపోయింది. అక్టోబర్‌లో జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు కూడా వికటించింది. కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి విజయం సాధించింది.
ఇదిలా ఉంటే, శనివారం అరవింద్ కేజ్రీవాల్‌పై అశోక్ ఝా అనే వ్యక్తి లిక్విడ్‌తో దాడి చేశాడు. 41 ఏళ్ల ఝా బస్ మార్షల్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలలుగా జీతం అందకపోవడంతో కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఆప్ ఏర్పాటు సమయంలో తాను ఆ పార్టీకి విరాళం ఇచ్చానని, అయితే వారు తప్పుడు వాగ్దానాలు ఇచ్చారని చెప్పాడు. ఈ వ్యవహారంపై బీజేపీ వర్సెస్ ఆప్‌గా మారింది. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.