Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
- వర్షాకాలంలో జెర్రులు ఎందుకు ఎక్కువగా వస్తాయి?
- తేమ తగ్గిస్తే జెర్రుల సమస్యకు చెక్
- గోడల సందులు మూసేస్తే కీటకాలకు ఎంట్రీ బంద్
- వేప, కర్పూరం, వెనిగర్‌తో సహజసిద్ధ పరిష్కారం
- రసాయనాలు లేకుండానే జెర్రులను దూరం చేసే టిప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainy Season Tips : సాధారణంగా ఇళ్లలో తేమ, చీకటి ఎక్కువగా ఉండే ప్రదేశాలైన వంటగది, బాత్రూమ్, శౌచాలయాలలో జెర్రులు (Centipedes) లేదా లక్ష్మీ జెర్రులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కువగా బయటకు వస్తుంటాయి. ఇవి విషపూరితమైన కీటకాలు కావడం వల్ల, పొరపాటున కుడితే తీవ్రమైన నొప్పి, వాపు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి.
ఇలాంటి కీటకాలు ఎక్కువగా గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు ఇళ్లలో రావడం చాలా సహజం. మరి ఇవి ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి వంటగది, బాత్రూమ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏయే ఇంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
తేమ లేకుండా పొడిగా ఉంచండి
జెర్రులు ఎల్లప్పుడూ తేమగా ఉండే చోట, కుళ్ళిపోయే సేంద్రీయ పదార్థాలు ఉన్న ప్రదేశాలలోనే పెరుగుతాయి. కాబట్టి, మొదటి నియమంగా మీ ఇంటిని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. వంటగది సింక్‌ను వాడిన తర్వాత పూర్తిగా తుడిచి ఆరబెట్టాలి. లీకేజీలు ఉన్న నల్లాలు లేదా పైపులను వెంటనే రిపేర్ చేయించాలి. రాత్రి పడుకునే ముందు బాత్రూమ్, వంటగది నేలపై నీరు లేకుండా తుడిచేయాలి. తేమ తగ్గితే జెర్రుల సంఖ్య ఆటోమేటిక్‌గా తగ్గుతుంది.
శుభ్రత చాలా ముఖ్యం
చిన్న చిన్న ఆహార కణాలు, పేరుకుపోయిన మురికి జెర్రులను త్వరగా ఆకర్షిస్తాయి. అందువల్ల, వంటగదిలో ఆహార పదార్థాలు కింద పడితే వెంటనే శుభ్రం చేయాలి. స్టౌవ్, గ్యాస్ సిలిండర్ కింద, గది మూలలను ప్రతిరోజూ క్లీన్ చేయాలి. డస్ట్‌బిన్‌కు తప్పనిసరిగా మూత ఉండాలి, అలాగే రోజూ కసాని పారేయాలి. సింక్ డ్రైనేజీ రంధ్రాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల కీటకాలు రావు.
గోడల బిరుకులు, రంధ్రాలను మూసివేయండి
గోడలు, టైల్స్, పైపుల మధ్య ఉండే చిన్న చిన్న సందుల గుండానే జెర్రులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి ఇంటి గోడలు, తలుపుల కింద ఉండే సందులు, కిటికీలు, పైపుల చుట్టూ ఉన్న రంధ్రాలను ‘సిలికాన్ సీలెంట్’ సహాయంతో పూర్తిగా మూసివేయాలి. తలుపుల కింద గ్యాప్స్ లేకుండా డోర్ స్వీప్స్ అమర్చడం చాలా మంచి పద్ధతి.
సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు
వేప నూనె లేదా వేపాకులు: జెర్రులు తిరిగే మూలల్లో వేపాకులు, లవంగాలు లేదా బిర్యానీ ఆకులు ఉంచడం వల్ల అవి రావు. కొద్దిగా బోరిక్ పౌడర్ చల్లినా ఫలితం ఉంటుంది.
ఉప్పు , కర్పూరం స్ప్రే: జెర్రులు ఉప్పు, కర్పూరం వాసనను అస్సలు తట్టుకోలేవు. బకెట్ గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల కల్లుప్పు (రాతి ఉప్పు) వేసి ఇల్లు తుడవాలి. అలాగే ఒక చెంచా కర్పూరం పొడి, కొద్దిగా వెనిగర్, డెటాల్లను నీటిలో కలిపి బాత్రూమ్ మూలల్లో, సింక్ కింద స్ప్రే చేయాలి. పరిశోధనల ప్రకారం కర్పూరంలోని ఘాటైన వాసన కీటకాల నరాల వ్యవస్థపై ప్రభావం చూపి, వాటిని దూరంగా పారద్రోలుతుంది.
ఎసెన్షియల్ ఆయిల్స్ (Essential Oils): పుదీనా (Peppermint) లేదా టీ ట్రీ ఆయిల్స్ వాసన జెర్రులను నిరోధిస్తుంది. ఒక స్ప్రే బాటిల్లో నీరు తీసుకుని, అందులో 10 నుండి 15 చుక్కల పుదీనా నూనె కలిపి ఇంటి మూలల్లో, ప్రవేశ ద్వారాల వద్ద స్ప్రే చేయాలి.
వైట్ వెనిగర్ (White Vinegar): డ్రైనేజీ పైపుల నుండి జెర్రులు రాకుండా ఉండటానికి ఒక కప్పు వైట్ వెనిగర్‌ను నేరుగా డ్రైన్ రంధ్రంలో పోయాలి. వెనిగర్ లోని ఆమ్ల గుణం జెర్రులను రాకుండా చేయడంలో సహాయపడుతుంది. అర బకెట్ వేడి నీటిలో ఒకటిన్నర కప్పు వెనిగర్ కలిపి బాత్రూమ్ నేలపై పోయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
తాజావార్తలు
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!