KTR: రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు… యువ విలాపమే..
- ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు యువ విలాపమే..
- ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు… యువ విలాపమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తున్న యువ వికాసం సంబరాలపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్ హామీలు, అబద్ధాలకు కేరాఫ్ గా ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు యువ విలాపమే అన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు హామీ బోగస్ అని తేటతెల్లం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా పబ్లిసిటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 55, 143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి చెప్పుకుంటుందని మండిపడ్డారు.
Read also: MLC By Election: రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమే అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. టీచర్ పోస్టులు 5,973, గ్రూప్-వన్ 60 నోటిఫికేషన్, స్టాఫ్ నర్స్ 6,494 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలు ఇస్తూ గొప్పలు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు మరిచి.. నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కు అధోగతే అన్నారు. కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటామని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ కాలెండర్, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీల తక్షణ ఆమలు కోసం యువత ప్రశ్నించాలని అన్నారు.
Reservations : లడఖ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95శాతం రిజర్వేషన్లు
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!