CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు (జనవరి 31) ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11.54 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో ఆప్ సంబంధాలు గురించి అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్లపై రాజకీయ దుమారం రేపింది. యమునా నీళ్లల్లో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం విష ప్రయోగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు అంటేనే ఇలాంటి వింతలు.. విశేషాలు కామన్‌గా జరుగుతుంటాయి. అయితే ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారి ఢీకొంటున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.
Rakesh Rathore: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అత్యాచార కేసులో ఈ రోజు అరెస్టయ్యారు. సీతాపూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాకేష్ రాథోడ్ విలేకరులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగు ఏళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ యూనిట్ జనరల్ సెక్రటరీగా ఉన్న రాథోడ్‌పై జనవరి 17న పోలీసులు కేసు నమోదు చేశారు.
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కూటమికి షాక్ తగిలింది. అనూహ్యంగా మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన హర్‌ప్రీత్ కౌర్ బబ్లా గురువారం ఎన్నికయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయని, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి మంత్రి ధన్యవాదాలు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల సీఎం…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని హైదారాబాద్ ఇన్చార్జి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమే అని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో గత పది ఏళ్లలో లేని అభివృద్ది ఇప్పుడు జరుగుతుంటే ఈర్శగా ఉందా? అని మంత్రి పొన్నం విమర్శించారు. జీహెచ్ఎంసీ…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ…