కుల సంఘాలను సర్వేలో పాల్గొనాలి అని చెప్పిన పాల్గొనలేదు.. ఈ సర్వేలో కావాలనే కొంత మంది పాల్గొన లేదు అని ఆయన వెల్లడించారు. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశాం.. ఇక, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 7గంటలకు మరోసారి సమావేశం అవుతాము.. కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించారు. విమర్శలు.. ప్రతి విమర్శలతో మాటల యుద్ధం సాగించారు.
T. Ram Mohan Reddy: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇక, కేటీఆర్ దమ్ముంటే శివారెడ్డిపల్లెకి రావాలంటూ సవాల్ విసిరారు. మీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ ఇచ్చిందో.. మా సర్కార్ ఎంత ఇచ్చిందో నువ్వు ఆర్టీఐకి దరఖాస్తు చేసుకుంటే తెలుస్తుంది అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర హల్చల్ చేసింది. పూర్వాంచల్కు చెందిన కొంతమంది మహిళలతో కలిసి యమునా నది నీళ్లు తీసుకుని కేజ్రీవాల్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది.
SC Classification: ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీకి, ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ మధ్య కీలక భేటీ కొనసాగింది.
KTR: బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైనా వేటు పడుతుందన్నారు.
V. Srinivas Goud: తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన నివేదిక తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది అని ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు.. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారు..
పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా అనేక నిధులు కేటాయించారు.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రానికి ఎన్నో విజ్ఞాప్తులు చేశాం.. కానీ పట్టించుకోవడం లేదు.. తెలంగాణ ఇంతకీ భారతదేశంలో లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పన్నులు కడుతుంటే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ మాత్రం మొండి చేయి చూపిస్తుందని కడియం శ్రీహరి అన్నారు.
Ponnam Prabhakar: ఎవరు.. ఎంతో వారికి అంత అని రాహుల్ గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగా కుల గణన సర్వే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు.. బలహీన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ ఒక్కటే అని, సర్వే లో పాల్గొనని వాళ్ళు… ఇప్పుడు కూడా నమోదు చేసుకోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వే కి వెళ్ళిన వాళ్లకు రెస్పాండ్ కాకుండా… ఇప్పుడు సర్వే రాలేదు అంటున్నారని, ప్రధాన రాజకీయ…
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే శివసేన(యూబీటీ)సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడని వెల్లడించాడు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఢిల్లీలోని ఓ నాయకుడితో చర్చలు జరుపుతున్నారని నితీశ్ రాణే ఆరోపించారు. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి ఆయనను మరో…