Maoist Party: మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Party: మావోయిస్టులకు కేంద్రం ఇచ్చిన డెడ్‌లైన్ దగ్గరపడుతోంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రం ప్రకటించింది. లేదంటే కఠిన వైఖరిని అవలంబిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్నతో పాటు మరో 25 మంది తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఎదుట లొంగుబాటు దిశగా ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారా లేదా పోలీసులు అరెస్ట్ చేశారా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వీరిని కర్రీగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలో భాగంగా వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రజాసంఘాలు మాత్రం ఈ ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అరెస్ట్ చేసిన వారిని లొంగుబాటు చేసినట్లుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. నిజానిజాలు బయటకు రావాలంటే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.
READ MORE: How to Store Carrot: ఇలా చేస్తే చాలు.. వారాలు గడిచినా క్యారెట్లు ఫ్రెష్‌గా ఉంటుంది..!
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!