న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ సృష్టించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు ప్రధాని మోడీపై తమ విశ్వాసాన్ని చూపించారన్నారు. తన గెలుపునకు మోడీకి, ఢిల్లీ ప్రజలు కారణమని, ఆ ఘనత వాళ్లకే దక్కుతుందన్నారు. గత 10 సంవత్సరాలుగా తాము ప్రజల మద్దతు పొందలేకపోయామన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఏర్పడుతున్న ప్రభుత్వం ప్రధాని మోడీకి గొప్ప పేరును తీసుకొస్తుందన్నారు. తన కోసం సమయం కేటాయించి ప్రచారానికి వచ్చిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం క్రెడిట్‌ను ప్రధానమంత్రి మోడీ ఇస్తున్నట్లు తెలిపారు. కాగా.. గెలుపు అనంతరం ఆయన ఓ ట్వీట్ చేశారు. హిందీలో “జైశ్రీరామ్” అని రాసుకొచ్చారు. ప్రస్తుతంపర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
READ MORE: Harish Rao : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది
ఇదిలా ఉండగా.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పోటీదారుగా చెబుతున్నారు. ప్రవేశ్ వర్మ 1977 నవంబర్ 7న ఢిల్లీలో జన్మించారు. ఆయన భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. అతని తల్లి పేరు రాంప్యారి వర్మ. ప్రవేశ్ వర్మ స్వాతి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రవేశ్ వర్మ తన ప్రాథమిక విద్యను ఆర్.కే లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలలో పూర్తి చేశారు. దీని తరువాత అతను కిరోరి మాల్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. అంతర్జాతీయ వ్యాపారంలో ఎంబీఏ పూర్తి చేశారు. తన తండ్రి రాజకీయాలను పునికి పుచ్చుకున్నారు.
READ MORE: Parvesh Sahib Singh: మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ.. తొలి ట్వీట్ వైరల్