రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ బీ. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ చెప్పినంత మాత్రాన మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లా?” అని ప్రశ్నించారు. ప్రజలు తమ వెంటే ఉన్నప్పుడు, కాంగ్రెస్ బలంగా కొనసాగుతున్న సమయంలో, గ్రాఫ్ తగ్గిపోతుందన్న అభిప్రాయం అసత్యమని ఖండించారు. ఫామ్ హౌజ్లో కూర్చొని పెన్ను, పేపర్ తీసుకుని గ్రాఫ్ గీస్తే, కాంగ్రెస్…
కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… " కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీకు ఉనికి లేదు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్ లు ఇస్తున్నారు.
Bharat Jodo Vivah: భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఈ భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా భారత్ జోడో వివాహం జరిగింది. భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది ఓ యువ జంట.
భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సోమవారమే జ్ఞానేష్ కుమార్ను సీఈసీగా కేంద్రం నియమించింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జ్ఞానేష్ కుమార్ వ్యతిరేకంగా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
Union Cabinet: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 19) కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టాక్.
జీహెచ్ఎంసీ పరిధిలోని తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫోకస్ మారుతోందా? అంటే...వాతావరణం అలాగే కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. పాలిటిక్స్ ఒక ఎత్తయితే... పోలీస్ బాసులు, వాళ్ళ పనుల మీదికి దృష్టి మళ్ళుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. మొన్న ఎమ్మెల్యే,ఇప్పుడు పార్టీ సీనియర్ లీడర్. వరుసగా చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ స్టేట్మెంట్స్ని విశ్లేషిస్తుంటే...
జనగామ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను తిట్టి సీఎం అయితే.. రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది.. వందల మంది ప్రాణాల త్యాగం లేదా..? అని ప్రశ్నించారు. రాజకీయంగా దెబ్బతింటాం అని తెలిసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర వాళ్లకు ఉందని అన్నారు.