KTR : తెలంగాణలో సాగునీటి సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల గత ఏడాది కాలంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎండిపోయాయని, సాగునీటి крైసిస్ అన్నదాతలను ఆత్మహత్యలకు దారి తీస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకునేందుకు సరిపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లను తగిన విధంగా…
బీఆర్ఎస్ ఎస్ఆర్ఎస్పై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా ఆరోపణలు చేసినా.. అంతిమంగా తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ని రద్దు చేసి... పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా ప్లాట్లు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా... ఇప్పటిదాకా ఆ ఊసే లేదంటూ... విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ.
Madhu Yaskhi Goud : తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి అధికారుల తీరుపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రభుత్వం పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించగా, అధికారంలో ఉన్న కొన్ని కీలక విభాగాల్లో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అడ్డుగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారు అని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పెత్తనం చేసిన అధికారులు ఇంకా…
రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఆమె అస్వస్థతకు గురయ్యారు.
రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ బీ. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ చెప్పినంత మాత్రాన మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లా?” అని ప్రశ్నించారు. ప్రజలు తమ వెంటే ఉన్నప్పుడు, కాంగ్రెస్ బలంగా కొనసాగుతున్న సమయంలో, గ్రాఫ్ తగ్గిపోతుందన్న అభిప్రాయం అసత్యమని ఖండించారు. ఫామ్ హౌజ్‌లో కూర్చొని పెన్ను, పేపర్ తీసుకుని గ్రాఫ్ గీస్తే, కాంగ్రెస్…
కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… " కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీకు ఉనికి లేదు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్ లు ఇస్తున్నారు.
Bharat Jodo Vivah: భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఈ భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా భారత్ జోడో వివాహం జరిగింది. భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది ఓ యువ జంట.
భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సోమవారమే జ్ఞానేష్ కుమార్‌ను సీఈసీగా కేంద్రం నియమించింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జ్ఞానేష్ కుమార్ వ్యతిరేకంగా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.