Off The Record: వాళ్ళిద్దరూ అధికార పార్టీ లీడర్స్. పైగా గతంలో ముఖ్యమైన పదవులు నిర్వహించినవారే. కానీ... ఇప్పుడు పవరున్న పార్టీలో ఉండి కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అవసరమైతే అధికారులను, పాలకులను నిలదీయండని జనానికి సలహా ఇస్తున్నారు.
CM Revanth : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు. బుధవారం సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘చాలామంది సీరియస్ గా పనిచేయట్లేదు. ఒకసారి గెలవడం గొప్పకాదు. మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్ప. చాలా మంది బీఆర్ ఎస్ పట్ల సైలెంట్ గా ఉంటున్నారు. అలా చేస్తే మీ మీద అభ్యర్థిని పెట్టరు అనుకుంటున్నారా.. అలా అస్సలు ఊహించుకోకండి.…
All-Party Meeting : కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎందుకంటే సౌత్ లోని అన్ని రాష్ట్రాలు గతంలో జనాభాను నియంత్రించాయని.. ఉత్తర భారత రాష్ట్రాలు నియంత్రించలేదు కాబట్టి.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉందని రేవంత్ ఇప్పటికే వివరించారు. ఈ లెక్కన జనాభా ఎక్కువ ఉన్న నార్త్ రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయని.. పార్లమెంట్ లో దక్షిణ రాష్ట్రాల…
Cm Revanth : తెలంగాణలోని ఇంటర్ కాలేజీలను గొప్పగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత జూనియర్ లెక్చరర్ల మీద ఉందంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన 1292 మంది జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నికల్ లెక్చరర్లకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు…
Haryana: కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర పరాజయం ఎదురైంది. హర్యానా స్థానిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానాలో ప్రభావంతమైన నేతగా చెప్పబడుతున్న భూపిందర్ హుడాకు కంచుకోటగా ఉన్న గురుగ్రామ్, రోహ్‌తక్‌తో సహా 10 మేయర్ స్థానాల్లో 09 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి-బీజేపీ తిరుగుబాటు నేత డాక్టర్ ఇందర్జిత్ యాదవ మానేసర్ని గెలుచుకున్నారు.
హర్యానాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. తాజాగా మార్చి 2న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిసార్, రోహతక్, కర్నాల్, యమునానగర్, గురుగ్రామ, మనేసర్‌కు ఎన్నికలు జరిగాయి.
KTR : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేటీఆర్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం పూర్తిగా ప్రాథమికంగా రాసిన ఒక…
Off The Record: కాబోయే ఎమ్మెల్సీ విజయశాంతి అక్కడితో ఆగుతారా? లేక అంతకు మించి అంటారా? ఎలాగూ నాది అధిష్టానం కోటా కదా.. ఇంకో అడుగు ముందుకేస్తే పోయేదేముందని ఆమె అనుకుంటే పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ దక్కించుకున్న ఊపులో కేబినెట్ బెర్త్ మీద కూడా కర్చీఫ్ వేసే అవకాశం ఉందా? ఆ విషయమై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?.
Off The Record: అంతా మీరే చేశారు.. ఇదో పాపులర్ సినిమా డైలాగ్. అంతా వాళ్లే చేస్తున్నారు. అన్నీ వాళ్ళకేనా? ఇవి తెలంగాణ కాంగ్రెస్‌లో పాపులర్ అవుతున్న క్వశ్చన్స్. వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదన్న సామెత ఆ ఉమ్మడి జిల్లా నేతలకు అచ్చుగుద్దినట్లు వర్తిస్తుందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
ఇంటర్ పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రశ్నలు అడగడంపై పంజాబ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. మార్చి 4 నుంచి పంజాబ్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. అయితే ఈ ప్రశ్నాపత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి పలు ప్రశ్నలు వచ్చాయి.