Pilot Rohit Reddy: పార్టీ మార్పుపై ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానని వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తనపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు.
BRS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ అభివృద్ధి పనులు శూన్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. “అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో” అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు.…
Anji Reddy Chinnamile : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా వేములవాడ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశలంఓ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజి రెడ్డి మాట్లాడుతూ.. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 లక్షల 75 వేల పన్ను మినహాయింపు ఇచ్చింది..చాలా మందికి వేసులు బాటు లభించింది…60 ఏళ్ల నుండి కానిది మోడీ…
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మహిళలే లక్ష్యంగా వరాలు జల్లులు కురిపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేశారు.
Thammineni Veerabhadram : ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు CPM తెలంగాణ రాష్ట్ర 4వ మహా సభలు జరుగనున్నాయి. జనవరి 25వ తేదీన సంగారెడ్డి PCR గ్రౌండ్ లో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. మహా సభలు బహిరంగ సభ పోస్టర్‌ను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కూడా సరికొత్త పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా ‘‘జీవన్ రక్షా యోజన’’ కింద రూ. 25 లక్షల ఆరోగ్య భద్రత పథకాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు.
Harish Rao : రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామిని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్ స్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు. ‘సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి గారూ… టెంట్లు…
KTR : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ఈ ఫిల్మ్‌ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రముఖ బీఆర్ఎస్ నేతలు హాజరై ఫిల్మ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గాంధీభవన్ వెలవెలబోతుండగా, తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషమని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌తో బీఆర్ఎస్…
హనుమకొండలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరంగల్ ఒక్క పట్టణానికి 6 వేల కోట్ల పనులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఇది అని, వరంగల్ పట్టణాన్ని మహా నగరాన్ని చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నామన్నారు.
రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్ పర్యటనలో మాట్లాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.