Thammineni Veerabhadram : ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామ సభలోనే జరగాలి
- ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రేవంత్ ప్రభుత్వం తీసుకుంటుంది
- ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చుతుంది
- మహా సభల్లో రేవంత్ సర్కార్ నిర్ణయాల పై చర్చ జరుపుతాము : తమ్మినేని వీరభద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thammineni Veerabhadram : ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు CPM తెలంగాణ రాష్ట్ర 4వ మహా సభలు జరుగనున్నాయి. జనవరి 25వ తేదీన సంగారెడ్డి PCR గ్రౌండ్ లో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. మహా సభలు బహిరంగ సభ పోస్టర్‌ను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రేవంత్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చుతుందని, నిర్బంధంలో రాష్ట్రంలో ఉంది…ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏడో వాగ్దానం స్వేచ్ఛ ఇప్పుడు అమలు కావడం లేదన్నా తమ్మినేని వీరభద్రం. మహా సభల్లో రేవంత్ సర్కార్ నిర్ణయాల పై చర్చ జరుపుతామని, జనవరి 26 నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రేవంత్ సర్కార్ చెప్పిందన్నారు తమ్మినేని వీరభద్రం. అంతేకాకుండా.. రైతు భరోసా తో ప్రభుత్వం చెప్పిన హామీలు చేస్తామని ప్రకటన చేయడం హర్షణీయమని, స్తానిక సంస్థల ఎన్నికల కోసం – ఎన్నికల లబ్దికోసమే కాకూడదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక గ్రామ సభలోనే జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హత కోసం రేషన్ కార్డు, జాబ్ కార్డు పెట్టకూడదని, జాబ్ కార్డులు, రేషన్ కార్డులు లేని వాళ్ళు లక్షల్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు పథకాలు తప్ప హామీలు అమలు చేయలేదని ఆయన అన్నారు. పట్టణాల్లో ఉపాధి హామీ అమలు చేయాలని కోరుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. మేము ప్రభుత్వంలో భాగస్వామ్యంగా లేమని, మేము ప్రభుత్వానికి మిత్రపక్షం కాదన్నారు. మేము మిత్రపక్షం అయితే మంత్రి పదవులు తీసుకునే వాళ్ళమని, రాష్ట్ర ప్రభుత్వం పై త్వరలో పోరాటాలు మొదలు పెడతామన్నారు తమ్మినేని వీరభద్రం.
Vidyasagar Rao: అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్‌ను రిసీవ్ చేసుకున్నా..
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
అనంతరం బీవీ రాఘవులు మాట్లాడుతూ.. లేబర్ కోర్టుల అంశంలో కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణలో లేబర్ కోర్టు రూల్స్ అమలు జరపమని రేవంత్ ప్రభుత్వం ప్రకటన చేయాలని, ఒక దేశం – ఒక ఎన్నిక అనేది నిరంకుశ వ్యవస్థ అన్నట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. వన్ నేషన్ -వన్ ఎలక్షన్ పై BRS పై స్పష్టమైన ప్రకటన చేయాలని, ఎలక్షన్ కాంట్రాక్టు రూల్స్ ను కేంద్ర బీజేపీ చేసింది…దీని వల్ల ఎన్నికలు పారదర్శకంగా జరగకుండా జరిగే అవకాశం ఉందని బీవీ రాఘవులు తెలిపారు. ఎలక్షన్ డిజిటల్ రికార్డులు ప్రజలకు ఇవ్వకుండా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయి… ఆ నిబంధనలు సవరించాలన్నారు. భట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పది శాతం బడ్జెట్ లో కేటాయిస్తామని ఘనమైన చరిత్ర అన్నట్లు ప్రకటించారని, రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు బడ్జెట్ కేటాయింపులు 25శాతం పెంచాలన్నారు.
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!