Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడెవరో ఈ రోజు తేలనుంది. దాదాపుగా 20 ఏళ్ల తరువాత మొదటిసారిగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గాంధీయేతర కుటుంబ నుంచి అధ్యక్షుడు రాబోతున్నారు. అక్టోబర్ 17న జరిగిన పోలింగ్ లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. ఇప్పటికే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి దేశంలో పలు రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు చేరాయి. అక్కడకు తరలించిన వాటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.
137 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించడం ఇది ఆరోసారి. 24 సంవత్సరాల అనంతరం తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య గట్టి పోటీ నెలకొననున్న సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో బళ్లారిలో రాహుల్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ అధ్యక్షుడినైతే ఏం చేస్తాననే విషయంపై మేనిఫెస్టో తయారు చేసి విడుదల చేశారు.. పార్టీలో మేమందరం ఒక్కటేనని, తమకు సిద్ధాంత వైరుధ్యాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే తమ చర్చ అన్నారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ ఫ్యామిలీలో అంతర్గత చర్చ జరుగుతోందన్నారు. హైదరబాద్‌లో కొందరిని…
Congress party key meeting in Rajasthan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండనున్నారు. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. అయితే ముందుగా అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ ‘‘ఒక వ్యక్తికి ఒక పదవి’’ అనేది కాంగ్రెస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. దీంతో ఇక…
Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించడంతో ఈ సారి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి వీర విధేయుడని అశోక్ గెహ్లాట్ కు పేరుంది. అయితే అశోక్ గెహ్లాట్ మాత్రం ఇటు…
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది… ఎల్లుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా… అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేస్తూ వస్తున్నాయి పలు రాష్ట్రాల పీసీసీలు.. కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ…