Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సోనియా, ప్రియాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి. 9 వేల మందికిపైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరుగుతోంది. భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో కూడా పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు.ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరుగుతుంది. నేడు పోలింగ్ జరుగుతుండగా.. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
Read Also: Sitrang Cyclone: ‘సిత్రాంగ్’ వచ్చేస్తోంది.. తస్మాత్ జాగ్రత్త
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో.. నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చారు. రాహుల్ గాంధీ కర్ణాటకలోని భారత్ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో ఓటు వేయనున్నారు. పీసీసీ ప్రతినిధులైన 40 మంది కూడా అక్కడే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Read Also: UK PM: లిజ్ ట్రస్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
శశి థరూర్ తిరువనంతపురంలోని కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఖర్గే బెంగళూరులోని కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయంలో ఓటు వేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబం మద్దతు మల్లికార్జున ఖర్గేకే ఉందన్న సంకేతాల నేపథ్యంలో.. ఆయన గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. అయితే నేడు శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఈరోజు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడానని.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తాము సహచరులుగా, స్నేహితులుగా ఉంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!