టిపిసిసి అద్యక్షుడుగా నియమితుడైన రేవంత్‌రెడ్డి వరుసగా కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్నారు. అయతే వారిలో హృదయపూర్వకంగా అభినందించిన వారు తక్కువేనని చెప్పాలి. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుండాలనీ, ఒకసారి నియామకం జరిగాక ఎవరు పదవిలోకి వచ్చినా సహకరించాలని ఇలా మాట్లాడిన వారే ఎక్కువ.మరీ బయిటపడి వ్యతిరేకత వెళ్లగక్కిన కోమటిరెడ్డి వెంకటరెడ్డివంటివారు పైనుంచి ్ల అక్షింతలు పడ్డాక మౌనం దాల్చారే గాని మనసు మార్చుకున్నట్టు కనిపించదు.తమ వారినే గాక బయిటి సీనియర్లనూ కలుస్తున్న రేవంత్ కొందరినిపార్టీలోకి ఆకర్షిస్తారని అనుకుంటుంటే ఇలాటి అయిష్టులు బయిటకు వెళతారా అన్నది కూడా ఒక వూహాగానంగావుంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌పైన టిఆర్‌ఎస్‌పైన రేవంత్ సంధిస్తున్న బాణాలకు అధికార పార్టీ కూడా దీటుగానే జవాబిస్తున్నది.ఉత్తమ కుమార్ పోయి ఉత్తర కుమారుడు వచ్చాడని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కెసిఆర్ నుంచి గుంజుకోవలసిన సమయం వచ్చిందని ఆయన అంటే ఇదేమైనామూటా అనిఎంఎల్‌ఎ దానంనాగేందర్‌జవాబిచ్చారు.తాను కాంగ్రెస్‌లోచేరతాననే వూహాగానాలను కూడా ఖండిరచారు. రేవంత్ బిజెపిపైన విమర్శలు చేస్తున్నా సహజంగా కేంద్రీకరణ కెసిఆర్‌పైనే వుంటుంది. తాను దూకుడుగానే వుంటాననీ, పదునుగా మాట్లాడతాను గాని అసభ్యంగా మాట్లాడబోనని రేవంత్ వివరించారు.అయితే కాంగ్రెస్ బిఫారంపై గెలిచి పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలనీ గుండెల్లో గునపం గుచ్చాలని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం రకరకాల వ్యాఖ్యలకు దారితీసింది. ఫిరాయింపు దారులకు సంబంధించి అనర్హత చట్టంవుంది. దాన్ని సభాపతులు సకాలంలో వినియోగించని మాటనిజమే. అయినా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తాజాగా కూడా తీర్పునిచ్చింది.
read also : తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం : సీఎం కేసీఆర్
ఆ మాటకొస్తే రేవంత్ స్వయంగా టిడిపి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అలాటి వ్యక్తి ఏకంగా రాళ్లతోకొట్టి చంపడం వంటి మాటలు వాడటం ఎలా చెల్లుతుంది? అధికారపార్టీ కాకున్నా ఆ సమయంలోటిడిపి కన్నా కాంగ్రెస్‌కే అవకాశం ఎక్కువన్న అంచనా అందుకు కారణమని అందరికీ తెలుసు. నిజంగానే ఆయన ఆశ ఫలించి 2018శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినా 2019 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైనారు. వచ్చినప్పటినుంచి పార్టీలోచురుగ్గా పనిచేస్తూ తనకంటూ ఒక అనుచరవర్గాన్ని మీడియా సోషల్‌మీడియా పునాదిని పెంచుకున్నారు.అదే సమయంలో ఓటుకు నోటు కేసు ఆయనను వెంటాడుతూనేవుంది.వీటిని పార్టీలోనిప్రత్యర్థులే ప్రస్తావిస్తున్నారు భూములసమస్యపైనా టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేసులు పెడితే తను మంత్రి కెటిఆర్‌పై ఎదురుకేసులు పెట్టారు.
ఇవన్నీ చివరకు ఎలా తేలేది చూడవలసిందే. దేశంలో కాంగ్రెస్‌పరిస్తితి సరిగ్గా లేకపోవడం ఒకటైతే టిపిసిసిలో సీనియర్లను దారికితెచ్చుకోవడమే పెద్ద సవాలు అవుతుందికేవలం మాటల దాడి కన్నా ప్రజల సమస్యలపై పోరాడటం ద్వారానూ హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదటి సవాలు కాగా ఇక్కడ ఈటెలకే ఓట్లు పడొచ్చు ననిరేవంత్ ఇప్పటికే ఒప్పుకోవడంలో వాస్తవికత కనిపిస్తుంది. అదొక్కటే గాకరాష్ట్ర బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ వంటివారి పోటీని తట్టుకోవడంద్వారానూ రేవంత్ కాంగ్రెస్‌ను నడిపించాల్సి వుంటుంది