నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్లలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు 10 కిలోమీటర్లమేర పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర అనంతరం భహిరంగ సభలో రేవంత్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్ తదితరులు ప్రసంగిస్తారు.
Read: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ …
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రాల్లో ఒకరోజు పాతయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తు ఈ పాదయాత్ర చేపట్టారు. ముడిమ్యాలలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పాదయాత్రను ప్రారంభించారు రేవంత్ రెడ్డి. కరోనా నిబంధనలు పాటిస్తూనే పాదయాత్ర చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.