మాజీ ఎంపీ మధుయాష్కీ ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రజల్లో నమ్మకం కుదిరించలేకపోతున్నాం. వందల కోట్లు వున్న నేతలు వాళ్ళు వేసే ఎంగిలిమెతుకుల కోసం పార్టీకి ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. రేవంత్ రెడ్డి వచ్చాక రెడ్డి సామాజిక వర్గం వస్తుందని భావించాం. కానీ ఆందోళనకర రీతిలో హుజురాబాద్‌లో 3వేలకు ఓట్లు పడిపోవడం దారుణం. దీని వల్ల పార్టీలో మనోస్థైర్యం తగ్గింది.
క్షణికానందం కోసం కాంగ్రెస్ నేతలు కొందరు డబ్బులు తీసుకుని నాకు ఓటు వేయలేదు. కవితను ఓడించాలని చూశారు కానీ అక్కడ బీజేపీకి లాభం అయింది. కాంగ్రెస్ పార్టీ బలమయిన అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత నాపై వుంది. పార్టీలో భవిష్యత్ లేదంటే యువత దూరం అవుతారు. పార్టీలో కుటుంబంలో భార్యకు, కూతురికి, కోడలికి, కొడుక్కి అందరికీ ఇవ్వడం మంచిది కాదు.
రాహుల్ గాంధీ ఆలోచనతో ముందుకెళతాను. ఎన్నికలు వచ్చేనాటికి మేం ఎక్కడ పోటీచేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. డీఎస్ పార్టీలోకి మళ్ళీ వస్తాననే ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడడం వల్ల డీఎస్ నష్టపోయారు. ఆయన పార్టీలోనే వుండి వుంటే సీఎం అభ్యర్ధి అయివుండేవారు. పార్టీ ఓకే అంటే ఎవరూ అడ్డుకోవడం కుదరదు. డీఎస్ వెళ్ళాక పార్టీనుంచి అంటిపెట్టుకున్నవారిని కాపాడుకోవాలి. వారికి మంచిస్థానం ఇవ్వాలి.
డీఎస్ పార్టీలోకి వస్తే ఆయన కొడుకు అరవింద్ బీజేపీ ఎంపీగానే వుంటారా ? అంటే అధిష్టానం నుంచి సరైన సమాధానం రాలేదు. కేసీఆర్-మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. మోడీని పొగుడుతూ వుంటారు. 2022లోనే ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఆర్ఎస్ఎస్ ప్లానింగ్ లో ఉంది. కొత్త పార్లమెంట్ భవనం పూర్తయ్యాక రాజ్యాంగాన్ని మోడీ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే పనిలో ఆర్ ఎస్ ఎస్ వుంది. కేంద్రం, రాష్ట్రం కలిసి వున్నాయి. ముందస్తు ఎప్పుడైనా రావచ్చు. ఈమధ్యకాలంలో న్యాయవ్యవస్థ ఔన్నత్యం పెరిగింది. జస్టిస్ ఎన్వీరమణ గారు వచ్చాక న్యాయవ్యవస్థమీద నమ్మకం పెరిగిందన్నారు మధు యాష్కీ.