Chiranjeevi in Congress: కాంగ్రెస్‌లోనే చిరంజీవి.. సోనియా, రాహుల్‌తో మంచి సంబంధాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi in Congress: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. రీ ఎంట్రీ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయారు.. వరుస సినిమాలు చేస్తున్నారు.. ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్లలో సత్తా చాటుతోంది.. అయితే, ఆ మధ్య చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అంటూ ఓ డైలాగ్ ఉంది.. అలాగే ఉంది ఇప్పుడు చిరంజీవి పరిస్థితి.. ఎందుకంటే.. ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు.
Read Also: GST Removal on helmets: హెల్మెట్‌లపై జీఎస్టీ వద్దు.. తొలగించండి..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
ఒంగోలులో నిన్న మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని తెలిపారు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని మీడియా ప్రతినిధులకు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.. ఇక, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని.. ఆ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేస్తున్నామని వెల్లడించారు గిడుగు రుద్రరాజు.. దీంతో, మరోసారి చిరంజీవి-కాంగ్రెస్ చర్చ తెరపైకి వచ్చినట్టు అయ్యింది.. కాగా, రాజకీయం తన నుంచి దూరం కాలేదని మెగాస్టార్ చిరంజీవి.. గాడ్‌ఫాదర్ డైలాగ్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఓ ఆసక్తికర పరిణామం జరిగింది.. చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడీని విడుదల చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కూడా జారీ చేసింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాద్యతలను నిర్వర్తించారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టిని సారించారు. ఇక, ఈ మధ్య పలు సినిమా ఇంటర్వ్యూల్లో.. పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై కూడా స్పందించారు.. అవసరం అయినప్పుడు తన తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పుకొచ్చారు చిరంజీవి.. మరి 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!