Kamal Haasan MNM Party Website Hacked: ఈమధ్య హ్యాకర్లు రాజకీయ నాయకులకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను, వెబ్‌సైట్లను హ్యాక్ చేసే సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా కమల్ హాసన్ పార్టీకి సంబంధించిన మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) పార్టీ వెబ్‌సైట్ హ్యాక్‌కి గురైంది. సాధారణంగా హ్యాకర్లు ఇలా హ్యాక్ చేసినప్పుడు.. ఏవేవో పిచ్చిపిచ్చా రాతలు రాస్తుంటారు. షేర్ మార్కెట్‌కి సంబంధించిన వివరాల్ని పొందుపరచడమో లేక రాజకీయానికి సంబంధం లేని ఇతర రాతలు రాసి పెడుతుంటారు. కానీ.. కమల్ హాసన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఈసారి రాజకీయంగానే ఆ హ్యాకర్లు టార్గెట్ చేశారు. కమల్ హాసన్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్టుగా ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొనడం, ఈరోడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఎన్ఎం మద్దతు ప్రకటించడంతో.. ఈ విలీనం నిజమేనని రాజకీయవర్గాలు భావించాయి.
Vijay: నా కొడుకుతో నాకు విభేదాలు నిజమే.. ఓపెన్ అయిన విజయ్ తండ్రి
కానీ.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఎంఎన్ఎం పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎంఎన్ఎం విలీనం అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని, తమ వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేశారని ఆ పార్టీ వివరణ ఇచ్చింది. ‘‘కాంగ్రెస్‌తో విలీనం వార్త పూర్తిగా అబద్ధం. అసలు అలాంటి ఆలోచనే లేదు. కాకపోతే ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మాత్రమే మద్దతిస్తున్నాం. దీనిపై మా నేత కమల్ హాసన్ త్వరలో అధికారిక ప్రకటన చేస్తారు’’ అంటూ ఎంఎన్ఎం ప్రతినిధి మురళి అబ్బాస్ చెప్పారు. కాగా.. తమ వెబ్‌సైట్ హ్యాక్‌కి గురైందన్న విషయం తెలిసిన వెంటనే ఎంఎన్ఎం పార్టీ నేతలు మెయింటెనెన్స్ కోసమంటూ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా మూసేశారు. అటు.. 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించిన కమల్.. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కానీ, ఒక్క సీటు కూడా దక్కలేదు.
Extra Marital Affair Effect: వివాహేతర సంబంధం.. కటకటాల్లో ప్రియురాలు