ఆర్మీ జనరల్స్‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలని ఆర్మీ జనరల్స్‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్మీ ఆఫీసర్లే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
Imran Masood:బీహార్ ఎన్నికల పోరులో కొత్త పంచాయతీ మొదలైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ దేశభక్తుడు, విప్లవకారుడు భగత్ సింగ్‌ను తీవ్రవాద ఇస్లామిక్ సంస్థ హమాస్‌తో పోల్చడం బీహార్‌లో కొత్త వివాదానికి దారితీసింది. ఆయన ప్రకటనపై బీజేపీ ఎదురు దాడి చేయడం ప్రారంభించింది. బీజేపీ దాడి తరువాత మసూద్ తన ప్రకటనపై వెనక్కి తగ్గాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ అలాంటి పోలిక చేయలేదని, భగత్ సింగ్ “షహీద్-ఎ-ఆజం” అని,…
ప్రజాప్రతినిధి అంటేనే ప్రజలకు సేవ చేసేవాడు. అది మరిచిపోయిన ఓ నేత.. ప్రజల చేతనే పని చేయించుకున్నాడు. బీహార్‌లో వరద ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన ఓ కాంగ్రెస్ ఎంపీ చాలా ఓవరాక్షన్ చేశారు. గ్రామస్తుడి భుజంపైకి ఎక్కి వరద ప్రాంతాలను పరిశీలించారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. నిత్యం ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎంపీలతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడంతో శశిథరూర్ పార్టీ మారడం ఖాయమని పొలిటికల్‌గా అందరూ ఫిక్స్ అయిపోయారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అగ్ర రాజ్యంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా తెలిపారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగించనున్నారు
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారడమే మిగిలింది. ఈ బిల్లు ముస్లింలకు మేలు చేకూరస్తుందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చెబుతుండగా, ఇది ముస్లింల హక్కుల్ని కాలరాస్తుందని కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌పై దుండగులు దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యక్రమానికి స్కూటర్‌పై వెళ్తుండగా ముసుగులు ధరించిన ఆగంతకులు బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… " కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీకు ఉనికి లేదు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్ లు ఇస్తున్నారు.
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ట్రంప్‌తో మోడీ చర్చలు భారత్‌కు ప్రోత్సాహకరంగా.. ఆందోళనలు పరిష్కరించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. రూ. రెండు లక్షల లోపు ఉన్న వారికే రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ఎవరికైనా రుణ మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తాం.