తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 8.15 గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
కర్నాటకలోని బెళగావి జయనగర్‌లో బీజేపీ నేత పృథ్వీ సింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ చన్నరాజ్ హత్తిహోళి కత్తితో దాడి చేశారు. ఆయన నివాసానికి సమీపంలోనే ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పృథ్వీ సింగ్ చేతులు, వీపుపై గాయాలయ్యాయి. దీంతో అతన్ని బెలగావిలోని కేఎల్‌ఈ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలతో బానిసలుగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని నివారించడంలో విఫలమైందని చెప్పక తప్పడం లేదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కి రేవంత్ రెడ్డి ఇంటి పైన జరిగిన దాడికి కండిస్తున్నాం. ప్రజాస్వామ్యం లో ఇది ఒక పిరికిపందలు చేసే హీనమైన చర్య అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్ తన వైట్ ఛాలెంజ్ ఒకే చేశారు. కేటీఆర్ రేవంత్…