Telangana Elections : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 8:15 గంటలకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్‌ను ప్రభావితం చేసే పనిలో ఉన్నారని ఓ పార్టీ తెలియడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి ఇరువర్గాలను చెదరగొట్టి లాఠీచార్జి చేశారు.
Read Also:Revanth Reddy: కొడంగల్ లో ఓటేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కంటోన్మెంట్లో కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం
హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓటు వేసే సమయంలో ఈవీఎం మిషన్, డబ్ల్యూపీఏటీల ఫొటోలు తీసి వాటిని వాట్సాప్ స్టేటస్ పెట్టారు. అంతేకాకుండా పలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ ఫొటోలు పోస్ట్ అయ్యాయి. అవికాస్తా వైరల్ గా మారి వివాదాస్పదమయ్యాయి. మరోవైపు పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి పరికరాలు తీసుకురాకుండా అధికారులు నిషేధం విధించారు. ఇది గమనించకుండా పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారిపై అధికారులు, ఇతర పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Vivo S18 Series : వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్.. లాంచ్ కు ముందే ఫీచర్స్ లీక్..