CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నేడు వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించిన సీఎం, అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి, ఎంపీ డీకే…
Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో.. ఐఏఎస్ లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని, కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారన్నారు. కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోందని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపతామంటే ఆమోదించడానికి మేమేమైనా ఎడ్డోళ్లమా? అని ఆయన వ్యాఖ్యానించారు.…
Harish Rao : తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏకపక్షంగా తరలించుకుంటూ తెలంగాణకు నష్టం కలిగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్చలంగా చూస్తుండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హరీష్ రావు పేర్కొన్నట్టుగా, గత మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు 10వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోంది. ఏడాది మొత్తంగా ఇది 646 టీఎంసీలకు చేరుకుంటుంది.…
తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం హైడ్రా అక్రమ కట్టడాలను తొలగించింది. కోమటికుంట ఎఫ్టీఎల్ లో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. కోమటి కుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడింది.. అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు విచారణలో తేలడంతో కూల్చివేతలకు ఆదేశించింది.
కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీ సర్వే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమన్నారు బండి సంజయ్. ఎందుకంటే కుల గణన సర్వే అంతా తప్పుల తడక అని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం… తెలంగాణలో 3 కోట్ల 35 లక్షలకుపైగా ఓటర్లున్నారు… అట్లాగే ఓటు హక్కు లేని వారి విషయానికొస్తే…. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల సంఖ్య 60 లక్షలుగా నమోదైందన్నారు. వీరుగాక…
KTR : కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తంచేసినా వినకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పారదర్శకంగా, శాస్త్రీయంగా కుల గణన సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సర్వే పూర్తిగా సమగ్రంగా, జాతీయ ప్రామాణికాలతో నిర్వహించబడుతోందని, అందుకు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించారని తెలిపారు. మొత్తం…
DK Aruna : ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యార్థుల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ, ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల కితం షాద్నగర్లో నీరజ్ అనే విద్యార్థి పాఠశాలపై నుంచి దూకి మృతి చెందగా, తాజాగా బాలానగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని…
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ సమావేశం నిర్వహించింది.