KTR : కాంగ్రెస్ ప్రభుత్వ 14 నెలల పాలనలో రాష్ట్రంలోని గురుకులాల్లో 83 మంది విద్యార్థుల మరణం భారతదేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం, ఇచ్చోడ మండలంలో ఓ 9వ తరగతి విద్యార్థి నిద్రలోనే మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేటీఆర్ ఎక్స్ (Twitter) వేదికగా స్పందించారు.
“గురుకులాల్లో విద్యార్థుల మరణ ఘోషను నిలువరించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస మానవత్వం కూడా లేదని స్పష్టమైంది. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని లాలిత్య అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్రమైన విషాదం. కన్నుముందే పతనమైన తన కూతురిని చూసి శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, బాధిత తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమైన చర్య.
రోజురోజుకు ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కనికరం లేకుండా ప్రవర్తిస్తోంది. ఈ అన్యాయానికి విద్యాశాఖ మంత్రిగా వైఫల్యాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి, హోంమంత్రిగా పూర్తిగా విఫలమై బాధ్యత వహించాల్సిన స్థితికి చేరుకున్నాడు,” అని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
CM Chandrababu: పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం కీలక సమీక్ష