ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, హాస్యనటుడు శ్యామ్ రంగీలాకు సోమవారం జైపూర్‌లోని ప్రాంతీయ అటవీ అధికారి ఎదుట హాజరుకావాలని నోటీసు అందజేసింది. జైపూర్ నగరంలోని ఝలానా చిరుతపులి రిజర్వ్‌లో నీల్‌గాయ్‌కు ఆహారం తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాతో వైరల్ అయింది.
Priyadarshi: షార్ట్ ఫిలిమ్స్, పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనదైన మార్క్ పంచులతో పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి.
ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా, అదరక బెదరక ఇట్టే ఆకట్టుకొనే అభినయంతో అలరించే బాలలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నవ్వుల పువ్వులు పూయించే ఆలీ స్థానం ప్రత్యేకమైనది.
“కళ్ళ కింద క్యారీ బ్యాగులు…” ఉంటేనేం, కామెడీతో కబడ్డీ ఆడగలిగే సత్తా ఉంటే చాలు, నందులు నడచుకుంటూ రావలసిందే! అంతటి ధీమాతోనే ఎమ్.ఎస్.నారాయణ నవ్వులు పూయించారు. అందువల్లే ఎమ్మెస్ నారాయణను ఐదు సార్లు బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డులు వరించాయి. ఎమ్మెస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు, అసంకల్పితంగా ప్రేక్షకుల పెదాలు విచ్చుకొనేవి. ఇక ఆయన కదిలితే చాలు జనానికి చక్కిలిగింతలు కలిగేవి. నోరు విప్పి మాట్లాడితే కితకితలే! పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రులో 1951…
కొందరు కొన్ని పాత్రలతో ఇట్టే జనం మదిలో చోటు సంపాదించేస్తారు. వంశీ తెరకెక్కించిన ‘లేడీస్ టైలర్’లోని బట్టల సత్తి పాత్రతో మల్లికార్జున రావుకు ఎనలేని గుర్తింపు లభించింది. అప్పటి నుంచీ మల్లికార్జునరావు తెరపై కనిపిస్తే చాలు జనం ‘బట్టల సత్తి’ అంటూ పిలిచేవారు. అలా ‘బట్టల సత్తి’ గా జనం మదిలో నిలచిన మల్లికార్జున రావు తన దరికి చేరిన ఏ పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయేవారు. జనాన్ని ఆకట్టుకొనేవారు. మల్లికార్జునరావు 1951 డిసెంబర్ 13న అనకాపల్లి సమీపంలోని…
సాప్ట్ వేర్ ఇంజనీర్ నుంచి నటుడుగా మారిన రఘు కారుమంచి ఇప్పుడు మరో బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. 2002లో ‘ఆది’తో నటుడు అయిన రఘు ఆ తర్వాత పలు చిత్రాలలో హాస్య పాత్రలతో అలరించటమే కాదు జబర్ దస్త్ షోలో రోలర్ రఘుగా టీమ్ లీడ్ చేశాడు. కరోనా టైమ్ లో ఫార్మింగ్ మీద దృష్టి పెట్టి సమర్థవంతంగా వ్యవసాయం చేస్తూ వచ్చాడు రఘు కారుమంచి. ఇప్పుడు అనుకోకుండా మిత్రులతో కలసి మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.…
ప్రముఖ సినీ నటుడు, మెజీషియన్ రమణారెడ్డి అభిమానులకు శుభవార్త. నవ్వుల మాంత్రికుని గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన టి.వి. రమణారెడ్డి శత జయంతి సంవత్సరమిది. ఆణిముత్యం లాంటి అరుదైన నటుని శతజయంతి సందర్భంగా ‘నవ్వుల మాంత్రికుడు’ పేరుతో ఓ పుస్తకం రానుంది. ఆయన సమగ్ర జీవిత విశేషాలతో ఈ పుస్తకం సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. మూవీ వాల్యూమ్ మీడియా హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. సీనియర్ జర్నలిస్టు, రచయిత ఉదయగిరి ఫయాజ్ ఈ పుస్తకాన్ని…
నవ్వడం ఒక వరమైతే, నవ్వించడం గొప్ప వరం. పదిమందిని నవ్విస్తున్న వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో పనిచేస్తున్న నాజర్ మహ్మద్ అనే వ్యక్తి కమెడియన్‌గా మారిపోయారు. అఫ్ఘనిస్తాన్‌లో ఖంసా జ్వాన్‌గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదిమందికి నవ్వులు పంచుతున్న నాజర్ మహ్మద్‌ను తాలీబన్లు కిడ్నాప్ చేసి దారుణంగా గొంతుకోసి హత్యచేశారు. ఇస్లామ్ ప్రకారం నవ్వించడం నేరం అని అందుకే నాజర్‌ను హత్యచేశారని అంటున్నారు. కాందహార్ ప్రావిన్స్‌లోని…