Kiraak RP: జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కిర్రాక్ ఆర్పీ ఫుడ్ బిజినెస్లోకి దిగిన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లిలో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. కానీ కొన్ని కారణాల వల్ల దానిని నెలలోపే దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఈ బిజినెస్ తాను ఊహించిన దానికన్నా ఎక్కువ స్థాయిలోనే సాగింది. పెద్ద సంఖ్యలో జనాలు పోటెత్తడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో తాత్కాలికంగా కర్రీపాయింట్ మూసేశాడు ఆర్పీ. డిమాండుకు తగ్గట్లుగా సప్లై ఉండాలన్న ఆలోచనతో నెల్లూరు వెళ్లి అక్కడ చేపల పులుసు తయారీ పోటీ పెట్టాడు. దాదాపు 200 మంది వరకు తాము చేసిన చేపల పులుసును తీసుకుని.. ఆర్పీ చెప్పిన ప్లేసుకు వచ్చారు. వారిలో కొందర్నీ సెలక్ట్ చేశాడు ఆర్పీ. రుచికరంగా వండిన కొందరు మహిళలను హైదరాబాదుకు తీసుకొచ్చి తిరిగి కర్రీ పాయింట్ ప్రారంభించాడు.
Read Also: JM Joshi : మాఫియాతో లింకు పెట్టుకున్నందుకు తీసుకెళ్లి పదేళ్ల శిక్ష వేశారు
కిర్రాక్ ఆర్పీ త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్నాడు. తాను లవ్ చేసిన లక్కీ అనే అమ్మాయితో అతడి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. త్వరలో వీరి మ్యారేజ్ జరగనుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు కిరాక్ ఆర్పీ. ఎన్నో విభిన్న స్కిట్స్‌తో అలరించి.. టీమ్ లీడర్‌గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా నెల్లూరు యాసలో అతడు పేల్చే పంచ్‌లు, ప్రాసలు బాగా ఆకట్టుకునేవి. ఆ తర్వాత మెగా జడ్జి నాగబాబుతో పాటు బయటకు వచ్చి.. అదిరింది షోలో కొన్నాళ్లు కొనసాగాడు. మధ్యలో డైరెక్షన్ ప్రయత్నాలు కూడా చేశాడు కానీ క్లిక్ అవ్వలేదు. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో మల్లెమాల సంస్థపై ఆరోపణలు చేసి.. వార్తల్లోకి ఎక్కాడు.
Read Also:Plane Fight: ఏమిరా బాబు ఎందుకంత ఆవేశం.. విమానంలో పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు