మరపురాని మల్లికార్జునరావు కామెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు కొన్ని పాత్రలతో ఇట్టే జనం మదిలో చోటు సంపాదించేస్తారు. వంశీ తెరకెక్కించిన ‘లేడీస్ టైలర్’లోని బట్టల సత్తి పాత్రతో మల్లికార్జున రావుకు ఎనలేని గుర్తింపు లభించింది. అప్పటి నుంచీ మల్లికార్జునరావు తెరపై కనిపిస్తే చాలు జనం ‘బట్టల సత్తి’ అంటూ పిలిచేవారు. అలా ‘బట్టల సత్తి’ గా జనం మదిలో నిలచిన మల్లికార్జున రావు తన దరికి చేరిన ఏ పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయేవారు. జనాన్ని ఆకట్టుకొనేవారు.
మల్లికార్జునరావు 1951 డిసెంబర్ 13న అనకాపల్లి సమీపంలోని కాశిమ్ కోటలో జన్మించారు. బాల్యం నుంచీ నాటకాలు చూడడం, అందులో నచ్చిన పాత్రల్లాగే నటించడం అలవాటు చేసుకున్నారు. దాంతో చదువుకొనే రోజుల్లోనే మిత్రులతో కలసి నాటకాలు వేశారు. రావు గోపాలరావు ఆయనను ప్రోత్సహించారు. రావు గోపాలరావు చిత్రసీమలో తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా జీవితం ఆరంభించారు. ఆ సమయంలోనే ఆయనను కలసిన మల్లికార్జునరావుకు సినిమాల్లో ఎలా నటించాలో మెలకువలు చెబుతూ ఉండేవారు. రావు గోపాలరావు నటుడై మంచి పేరు సంపాదించాక, మల్లికార్జునరావును ఆదరించారు. మల్లికార్జునరావులోని నటునికి దర్శకుడు వంశీ తాను తెరకెక్కించిన “మంచు పల్లకి, సితార, అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలర్, ఆలాపన” వంటి చిత్రాలలో అవకాశాలు కల్పించారు. ఈ సినిమాలతో నటునిగా మంచి గుర్తింపు సంపాదించారు మల్లికార్జునరావు. ఇతర సినిమాల్లోనూ పాత్రలు లభించాయి. దాంతో మల్లికార్జునరావుకు నటునిగా మరింత గుర్తింపు లభించింది. అయితే వంశీ మాత్రం తాను తెరకెక్కించే ప్రతీ చిత్రంలో మల్లికార్జునరావుకు ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను ఇచ్చేవారు. అలా “లాయర్ సుహాసిని, శ్రీకనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టుకింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, డిటెక్టివ్ నారద” చిత్రాలలో విలక్షణమైన పాత్రలు ఇచ్చారు వంశీ.
Also Read
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఎస్వీ కృష్ణారెడ్డి, ఇ.వి.వి. సత్యనారాయణ వంటి హాస్య చిత్రాల దర్శకులు కూడా మల్లికార్జునరావులోని నటునికి తగ్గ వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. తమ్ముడు సినిమాలోని మల్లికార్జున రావు నటనకు బెస్ట్ కేరెక్టర్ యాక్టర్ గా అవార్డు లభించింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సైతం తమ చిత్రాలలో మల్లికార్జునరావుకు తగ్గ పాత్రలు ఇచ్చేవారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఛైర్మన్ గానూ మల్లికార్జునరావు సేవలు అందించారు. ‘మా’ కు జనరల్ సెక్రటరీగానూ ఆయన పనిచేశారు. తెలుగు దేశం పార్టీ కల్చరల్ వింగ్ కు సెక్రటరీగానూ ఆయన ఉన్నారు. 2008 జూన్ 24న మల్లికార్జున రావు తుదిశ్వాస విడిచారు.
భౌతికంగా మల్లికార్జునరావు లేకపోయినా, ఆయన పోషించిన అనేక పాత్రలు ఈ నాటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ జనం ఆయనను ‘బట్టల సత్తి’గానే గుర్తుచేసుకుంటూ ఉంటారు.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!