Priyadarshi: షార్ట్ ఫిలిమ్స్, పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనదైన మార్క్ పంచులతో పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. టెర్రర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన పెళ్లిచూపులు సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మధ్యలో మల్లేశం సినిమాతో తనలో నటనలో ఉన్న మరో కోణాన్ని చూపించి కామెడీనే కాదు ఏ పాత్రలైనా చేస్తాను అని ప్రూవ్ చేసుకున్నాడు ప్రియదర్శి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈయన బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also: Telugu Movie Sequels : తెలుగులో సీక్వెల్స్ హవా.. మార్కెట్ ఎన్ని కోట్లంటే
ప్రియదర్శి తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి రావడం తన ఇంట్లో వారికి ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో సినిమాటోగ్రాఫర్ అవుదామని కెమెరా వర్క్ నేర్చుకున్నాను. ఇక 2014లో శ్రీకాంత్ హీరోగా నటించిన టెర్రర్ సినిమాకి ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్లాను. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నల్లగా.. సన్నగా ఉన్నాడని.. మొటిమలు ఎక్కువగా ఉన్నాయని.. హీరో కంటే పొడుగ్గా ఉన్నాడు అనే వాళ్లు అని.. అలా అన్నప్పుడల్లా నన్ను నేను ప్రొత్సహించుకునే వాడినని అన్నారు. అలాగే తనకు కొమురం భీం బయోపిక్ చేయాలని ఉందని. కాళోజీ జీవిత చరిత్ర కూడా చేయాలని ఉంది.. అలాగే రామోజీ రావు జీవిత చరిత్ర సినిమాగా తీస్తే అందులో నటించాలని ఉందని తెలిపారు. శాంతా బయోటిక్ వరప్రసాద్ బయోపిక్ చేయాలని ఉంది.. వీరి జీవితచరిత్రలలో ఎవరు నటించినా చూసి సంతోషిస్తానని అన్నారు.